Published
Mon, Aug 15 2016 11:29 PM
| Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
చరిత్రలో తొలిసారి!
ఇందూరు : రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కలెక్టర్ అవార్డును ప్రదానం చేసింది. మొదటి అవార్డు జిల్లా కలెక్టర్ యోగితారాణాను వరించింది. సోమవారం గోల్కొండలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో సీఎం చేతుల మీదుగా యోగితారాణా అవార్డును స్వీకరించారు. సమైక్య రాష్ట్రంలోనూ ఉత్తమ కలెక్టర్ అవార్డు ఎవరూ అందుకోలేదని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో కలెక్టర్ చూపిన చొరవకు ఈ అవార్డు దక్కిందంటున్నారు. యోగితారాణా చొరవతో హరితహారం అమలులో రాష్ట్రంలో, ఉపాధి హామీ పథకం అమలులో దేశంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. సీఎం తన ప్రసంగంలో కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులు అభినందిస్తుంటే తన ఆనందానికి అవధులు లేకుండా పోయానని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్‌కు అవార్డుతోపాటు లక్ష రూపాయల రివార్డును అందించారు.