శ్రీశైలానికి భారీగా వరదనీరు
Published Wed, Aug 10 2016 12:41 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం సమయానికి ఎగువ పరీవాహకప్రాంతమైన జూరాల నుంచి 1,79,482 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి విడుదలైంది. బుధవారం నాటికి డ్యాం నీటిమట్టం మరో రెండు అడుగులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జలాశయంలో 117.4872 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 863.60 అడుగులకు చేరుకుంది. జలాశయం నుంచి కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం 12,944 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 4,250 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Advertisement