తీర గ్రామాల్లో విదేశీ ప్రతినిధుల బృందం
హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 దేశాలకు చెందిన 22 మంది విదేశీ ప్రతినిధులు ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంత రక్షణ, మడ అడవులు ప్రాముఖ్యం, మత్స్యకారుల జీవన విధానాలు తదితర అంశాలను పరిశోధించేందుకు ఇక్కడికి వచ్చారు. జింబ్వాబ్వే, లైబేరియా, నైజీరియా, ఆఫ్టనిస్తాన్, ఇథియోపి
ప్రకృతి వైపరీత్యాలు, మడ అడవులపై పరిశోధన
తాళ్లరేవు : మండలంలోని పలు పర్యాటక ప్రదేశాలు, తీర ప్రాంత గ్రామాలలో విదేశీ ప్రతినిధుల బృందం మంగళవారం పర్యటించింది. హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 13 దేశాలకు చెందిన 22 మంది విదేశీ ప్రతినిధులు ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంత రక్షణ, మడ అడవులు ప్రాముఖ్యం, మత్స్యకారుల జీవన విధానాలు తదితర అంశాలను పరిశోధించేందుకు ఇక్కడికి వచ్చారు. జింబ్వాబ్వే, లైబేరియా, నైజీరియా, ఆఫ్టనిస్తాన్, ఇథియోపియా, కజికిస్తాన్, శ్రీలంక తదితర దేశాల ప్రతినిధులు ఉన్నట్టు ఎన్‌ఐఆర్‌డీ ప్రాజెక్టు హెడ్ ఈవీ ప్రకాష్‌రావు, డాక్టర్ వీ సురేష్ బాబు తెలిపారు. తొలుత వారు చొల్లంగిలోని కోరంగి అభయారణ్యాన్ని సందర్శించారు. కోరంగిలోని ఫారెస్ట్ స్టాఫ్ కాంప్లెక్స్, చినవలసలలోని డ్రై ఫిష్ ఫ్లాట్ ఫారమ్ పలు క్రీకులను పరిశీలించారు. పెదవలసల గ్రామంలో ఇగ్రీ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన క్రాబ్ మార్కెట్ కాంప్లెక్స్‌ను పరిశీలించి, అక్కడ మత్స్యకారులతో మాట్లాడారు. సునామీ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా వ్యవహరించారు, మడ అడవులు ఏ విధంగా దోహద పడ్డాయి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో విరివిగా లభించే మత్స్యజాతుల ఉత్పత్తులు, వాటివల్ల కలిగే ఉపాధి, వ్యాపార అవకాశాలపై శోధించారు. క్రాబ్ మార్కెట్‌లో పీతలను బృంద సభ్యులు ఆసక్తిగా తిలకించారు.