
మునుగోడు మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత
మునుగోడు(నల్గొండ జిల్లా): మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిణి నారాయణరావు(90) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
ఈయన వరసగా మూడుసార్లు సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడిన నాయకుడిగా పేరొందారు.