29న కొల్లేటికోట వంతెనకు సీఎం శంకుస్థాపన
29న కొల్లేటికోట వంతెనకు సీఎం శంకుస్థాపన
Published Thu, Aug 25 2016 7:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
విజయవాడ :
కొల్లేటికోట వంతెనకు ఈ నెల 29న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పందిరిపల్లెగూడెం గ్రామానికి సర్కారు కాలువపై కొల్లేటికోటకు అనుసంధానంగా రూ.13 కోట్లతో ఈ వంతెన నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ కొల్లేటికోట వంతెన శంకుస్థాపనకు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
రూ.300 కోట్లతో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రాజెక్ట్
పామర్రు మండలం నిమ్మకూరు గ్రామ కూడలి సమీపంలో రూ.300 కోట్లతో బెల్ కంపెనీ ఆధ్వర్యాన అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ కంపెనీ నిర్మాణానికి కూడా ఈ నెల 29వ తేదీన శంకుస్థాపన చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరవుతారని చెప్పారు. హెలీప్యాడ్ నిర్మాణం, సభల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, గుడివాడ ఆర్డీవో ఎం.చక్రపాణి, బెల్ కంపెనీ ఏజీఎం రవిప్రసాద్, సీనియర్ డెప్యూటీ జీఎం ఉమామహేశ్వరరావు, డీటీసీ మీరాప్రసాద్, డీఎఫ్‌వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement