ఆస్పత్రిలో అనాథ శవం
ఆదోని టౌన్ : పట్టణంలోని గోకారి జెండా వీధిలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందగా వన్ న్ పోలీసులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతి చెందిన వృద్ధుడి వయస్సు 65 ఏళ్లు ఉంటాయని, తెల్లని షర్టు, పంచ ధరించి ఉన్నాడని ఔట్‌పోస్టు కానిస్టేబుల్ పుల్లయ్య తెలిపారు. తెల్లని వెంట్రుకలు, చామన ఛాయ రంగు ఉన్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న వృద్ధుడి శవాన్ని పరిశీలించి గుర్తించవచ్చని చెప్పారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.