ఆడపిల్ల పుడితే..వైద్యం ఫ్రీ | free medical treatment Daughter born | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుడితే..వైద్యం ఫ్రీ

Published Thu, Feb 25 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

ఆడపిల్ల పుడితే..వైద్యం ఫ్రీ

ఆడపిల్ల పుడితే..వైద్యం ఫ్రీ

మహాలక్ష్మి పుట్టిందని పెద్దలు అంటుంటారు. దీనిని నిజం చేస్తోంది మండపేటలోని నారాయణరెడ్డి హాస్పటల్. ఆడపిల్ల పుడితే చాలు నార్మల్ డెలివరీ అయినా, శస్త్ర చికిత్స అయినా కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. అమ్మాయి పుట్టగానే అదృష్టం కలిసొచ్చిందన్న ఆనందాన్ని ఆ కుటుంబంలో నింపుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఆడ శిశువులకు జన్మనిచ్చిన 45 మంది తల్లులకు ఉచితంగా పురుడు పోసి, లక్షలాది రూపాయల విలువైన కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందించారు.
 
 సృష్టికి మూలం మహిళ.  సాంఘిక దురాచారాలకు అనేక సందర్భాల్లో భ్రూణ స్థాయిలోనే అంతమవుతోంది. ఈ నేపథ్యంలో తన వంతుగా ఇలాంటి దురాగతాలను నిర్మూలించడంతో పాటు ఆడశిశువుల జనన శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది మండపేటలోని నారాయణరెడ్డి హాస్పటల్స్. లయన్స్ క్లబ్ డెరైక్టర్, పారిశ్రామికవేత్త కర్రి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ వసతులతో మండపేటలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన నారాయణరెడ్డి హాస్పటల్స్ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. ఉచితంగా పెద్దఎత్తున వైద్య శిబిరాలనూ నిర్వహిస్తోంది. లయన్స్ క్లబ్ డెరైక్టర్‌గా, సామాజిక కార్యకర్తగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నారాయణరెడ్డి చేతనైనంతలో ఆడ శిశువుల జనన శాతాన్ని పెంచాలన్న సంకల్పమే ఈ ఉచిత డెలివరీలకు నాంది పలికింది.
 
 తెల్లరేషన్ కార్డు ఉంటే..
 పేద వర్గాలకు చెందిన వారు (తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారు) తమ ఆస్పత్రిలో డెలివరీ చేయించకుని, ఆడపిల్ల పుడితే నార్మల్ డెలివరీ అయినా, శస్త్ర చికిత్స అయిన నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నారు. డిసెంబర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మండపేట, అనపర్తి, కొత్తపేట, రామచంద్రపురం పరిసర ప్రాంతాలకు చెందిన 45మంది మహిళలకు ఆడ పిల్లలు జన్మించగా డెలివరీ, శస్త్రచికిత్సల రూపంలో లక్షలాది రూపాయలు విలువచేసే వైద్యసేవలను వారికి ఉచితంగా అందించారు. శస్త్ర చికిత్స అయితే మత్తు డాక్టర్, రక్తపరీక్షలు, మందులు చెల్లించుకుంటే సరిపోతుంది. ఎంత మందికి అయినా ఆడపిల్లలు జన్మించిన వారికి ఉచితంగా వైద్య సేవలందించాలన్నదే తమ లక్ష్యమని నారాయణరెడ్డి తెలిపారు.
 
 చాలా ఆనందంగా ఉంది
  నా భార్యకు నారాయణరెడ్డి హాస్పటల్స్‌లో పురుడు పోయిచాం. ఆపరేషన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. ఆపరేషన్‌కు, వైద్య పరీక్షలకు డబ్బులేవి తీసుకోకుండా ఉచితంగా చేశారు. కేవలం మత్తు డాక్టర్‌కు, మందులకు డబ్బులు చెల్లించామంతే. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. రూ. ఐదు వేలకే రూ.25 వేల వైద్యసాయం  రెండో డెలివరీలో నాకు ఆడపిల్ల జన్మించింది. రూ.25 వేల వరకు ఖర్చవుతుందని భావించాం. ఆడపిల్ల పుట్టడంతో ఆపరేషన్, వైద్య ఖర్చులేవీ తీసుకోలేదు. కేవలం రూ.ఐదు వేలు మాత్రమే ఖర్చయ్యాయి. నారాయణరెడ్డి హాస్పటల్స్ డాక్టర్లు కూడా దగ్గరుండి ఎంతో బాగా చూశారు.
 - ఈ.సునీత, మండపేట

 చేతననైనంతలో మార్పు తెచ్చేందుకు..
  పెంట కుప్పల్లోనో, కాలువల్లోనో ఎక్కడో ఓ చోట ఆడ శిశువులు విగత జీవులుగా పడి ఉండటం నన్ను ఎంతో కలిచివేస్తోంది. భ్రూణహత్యల నియంత్రణకు మా వంతు తోడ్పాటుగా ఉచిత డెలివరీలకు శ్రీకారం చుట్టాం. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రెండు నెలల్లో మా ఆస్పత్రి ద్వారా 45 మందికి ఉచితంగా పురుడు పోయడం ఆనందంగా ఉంది.
 - కర్రి నారాయణరెడ్డి, నారాయణరెడ్డి హాస్పటల్స్
 అధినేత, మండపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement