జోరువాన | full rain in District | Sakshi
Sakshi News home page

జోరువాన

Published Fri, Sep 23 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

జోరువాన

జోరువాన

  • జిల్లాలో విస్తారంగా వర్షాలు
  • పొంగిపొర్లుతున్న వాగులు..
  • మతyì  దుముకుతున్న చెరువులు 
  • హుస్నాబాద్‌ పట్టణం జలమమం 
  • ఎల్లంపల్లి నాలుగు గేట్లు ఎత్తివేత
  • ఎగువ, దిగువ మానేరుకు పెరిగిన వరద
  • అధికార యంత్రాంగం అప్రమత్తం
  • కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు 
  • 1800 4254 731, 0878–2244300
  • కరీంనగర్‌ అగ్రికల్చర్‌ : అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నమెున్నటి దాకా కరువుతో అల్లాడిన జిల్లాలో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు నిండి మత్తళ్లు దుముకుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సైదాపూర్‌ మండలంలో 15.8 సెంటీమీటర్లు, హుస్నాబాద్‌లో 15, భీమదేవరపల్లిలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం జోరందుకుంది. హుస్నాబాద్, కమలాపూర్, కరీంనగర్‌తోపాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20టీఎంసీల గరిష్ట నీటిమట్టం ఉండగా, భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి గోదావరినదిలోకి నీటిని వదిలారు. రాత్రివరకు ఇన్‌ఫ్లో 23,806 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8,382 క్యూసెక్కులుగా ఉంది. మోయతుమ్మద వాగుతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, ఈదుల వాగులు పొంగిపొర్లుతున్నాయి. మోయతుమ్మదవాగు నిండుగా ప్రవహిస్తుండటంతో కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద హుస్నాబాద్‌–సిద్దిపేట మధ్య రాకపోకలు బందయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం ఎల్‌ఎండీలో ప్రస్తుతం 6టీఎంసీల నీళ్లుండగా, వాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మెదక్‌ జిల్లాలో కురిసి భారీ వర్షంతో కూడవెళ్లి వాగు ఉప్పొంగింది. దీంతో మెున్నటిదాకా ఎడారిని తలపించిన ఎగువమానేరు జలాశయం నిండుతోంది. 32 అడుగుల సామర్థ్యమున్న ఎగువమానేరులో 24 అడుగుల వరకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే శనివారంలోగా ఎగువమానేరు పూర్థిస్థాయిలో నిండే అవకాశముంది. శనిగరం జలాశయం సామర్థ్యం 42 అడుగులు కాగా, 13 అడుగులకు నీరు చేరింది. 28 అడుగులకు మత్తడి పడనుంది. 2013 సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడే జలకళ సంతరించుకుంటోంది. ముస్తాబాద్‌ మండలం వెంకట్రావ్‌పల్లిలో వరద ఉధృతితో సిద్దిపేట–ముస్తాబాద్‌ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. చీకోడు జెడ్పీహైస్కూల్‌ ఆవరణలో నీళ్లు నిలిచి చెరువును తలపిస్తుండటంతో సెలవు ప్రకటించారు. 
     
    యంత్రాంగం అప్రమత్తం..
    జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సెలవు పెట్టరాదని, అనుమతి లేకుండా కరీంనగర్‌ను వదిలి వెళ్లరాదని కలెక్టర్‌ నీతూప్రసాద్‌ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉండాలన్నారు. 
     
    కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం..
    ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లోని ఇన్‌స్టాక్స్‌ గదిలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. ఆస్తి, ప్రాణ, పంట నష్టం, వరదల సహాయార్థం కంట్రోల్‌ రూంలోని హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800 4254 731, 0878–2244300 నంబరు ఫోన్‌ చేయాలని సూచించారు. కంట్రోల్‌రూంలో 24 గంటల సౌకర్యంతో అధికారులను షిప్టులవారీగా నియమించారు. వీరు ప్రజల సమస్యలను ఫోన్‌లో స్వీకరించి ఆయా ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపడతారు. 
     
    మండలాల వారీగా వర్షపాతం 
    ముత్తారం, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, రామడుగు మండలాల్లో లోటు వర్షపాతమే నమోదయ్యింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ముస్తాబాద్‌లో 8.5, సిరిసిల్లలో 8, గంభీరావుపేటలో 4.4, ఎల్లారెడ్డిపేటలో 3.7, వేములవాడలో 6.4, బోయినపల్లిలో 2.2, చందుర్తిలో 3.1, ఇల్లంతకుంటలో 3, కోనరావుపేటలో 3.2, శ్రీరాంపూర్‌లో 3.8, ధర్మారంలో 5.6, ఓదెలలో 3.6, కాటారంలో 2.7, కమలాపూర్‌లో 6.4, ఎల్కతుర్తిలో 5.8, కోహెడలో 5.6, బెజ్జంకిలో 4.7, హుజూరాబాద్‌లో 6.8, జమ్మికుంటలో 6, చిగురుమామిడిలో 7.1, వీణవంకలో 5.5, కేశవపట్నంలో 9.2, ఇబ్రహీంపట్నంలో 3.5, మెట్‌పల్లిలో 2.6, సారంగాపూర్‌లో 2.2, జగిత్యాలలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement