Karminagar
-
నిలిచిపోయిన ఓపి సేవలు.. రోగుల ఇబ్బందులు..
-
జగిత్యాల జిల్లాలో నవ వధువు కిడ్నాప్
సాక్షి, జగిత్యాల : నవ వదువు కిడ్నాప్ జగిత్యాలలో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి నవవధువును కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన జిల్లాలోని సమీప పొరండ్లలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన కొంపల సమత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 7న మల్యాల మండలం ఒబులాపూర్ వీరభద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అదే రోజు తమకు రక్షణ కావాలంటూ నూతన జంట సారంగాపూర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. దంపతులు రాకేశ్–సమత పొరండ్ల గ్రామంలో ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్‌తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్ కారులో పొరండ్ల గ్రామానికి వచ్చి మరో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీంతో భర్త వేముల రాకేశ్ జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై సతీశ్ కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
జోరు వాన
కరీంనగర్: జిల్లాలో శుక్ర, శనివారాల్లో జోరు వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇక బతుకమ్మ పండుగకు వర్షం అడ్డంకి మారింది. జగిత్యాల పట్టణంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. జగిత్యాల, సారంగాపూర్ మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. బీర్పూర్ గ్రామానికి చెందిన అల్లె మల్లేశానికి చెందిన ఇల్లు కూలిపోయింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముస్తాబాద్–సిద్దిపేట కల్వర్టు వద్ద నీటి ప్రవాహం పెరగడంతో ఇసుకతో నింపిన సంచులను అడ్డుగా వేశారు. ఆవునూర్, గూడెం గ్రామాల్లో కోతకు వచ్చిన వరిపంట నీట మునిగింది. సిరిసిల్ల మండలం అంకిరెడ్డిపల్లి–ఓబులాపూర్ మధ్య నూతనంగా వేస్తున్న రోడ్డు వర్షానికి దెబ్బతింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో పిడుగు పడింది. దీంతో పదిఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు, సెల్ఫోన్లు చెడిపోయాయి. మంథని మండలంలోని గోపాల్పూల్, చిన్నఓదాల, బిట్టుపల్లి, ధర్మారంలో వరిపంట నీట మునిగింది. ముత్తారం మండలం శుక్రవారంపేట, సర్వారంలో 30 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. మహాముత్తారం మండలంలో దౌతుపల్లి వద్ద గల లోలెవల్కాజ్వె, నిమ్మగూడెం పెద్దవాగులు పొంగిపోర్లాయి. దీంతో శనివారం మండల కేంద్రానికి రావాల్సిన అటవీ గ్రామాలైన కనుకునూర్, పెగడపల్లి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చొప్పదండి మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వరిపంట నేలకొరిగింది. -
పేరు ఒకరిది.. అద్దెలో మరొకరు..
గంజ్ లీజు లీలలు ఇతరులకు అద్దెకిచ్చిన లీజుదారులు మార్కెట్ విలువతో సొమ్ము చేసుకుంటున్న వైనం సర్కార్‌కు నామమాత్రపు అద్దె చెల్లింపు గడువు ముగిసినా రాజకీయ అండదండలు ముకరంపుర : గంజ్హైస్కూల్ షట్టర్ల లీజుదారుల లీలలు అన్నీ ఇన్నీ కావు.. లీజు గడువు ముగిసి ఎనిమిదేళ్లుగా గడిచినా షట్టర్లను వ్యాపారులు వదలడంలేదు. మార్కెట్ విలువ ప్రకారం ఇతరులకు అద్దెకిచ్చి కూడా సొమ్ము చేసుకుంటున్నారు. స్పందించాల్సిన ఆర్అండ్బీ, విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 1983 నుంచి 2007 జనవరి వరకు 25ఏళ్ల ఒప్పందంలో అతి తక్కువగా నెలకు రూ.180 అద్దె చెల్లించారు. గడువు ముగిసి షట్టర్లను విద్యాశాఖకు అప్పగించకుండా ఖాళీ చేయలేమంటూ కోర్టును ఆ్రÔ¶ యించారు. కోర్టుకేసును సస్పెండ్ చేసినా షట్టర్లను వదలకుండా అదే 21 మంది లీజుదారులు నామమాత్రపు రూ.1,365 అద్దెతో లోపాయికారీగా అధికార యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. లీజుదారుల్లో క్రమంగా వారి కొడుకులు, మనుమళ్లు దుకాణాలకు యజమానులుగా చెలామణి అవుతున్నారు. ఈ షట్టర్ల నిర్వహణ బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించినా తీరు మారలేదు. ప్రధానంగా గంజ్హైస్కూల్ విద్యాశాఖ ఆధీనంలో ఉన్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 21 షట్టర్ల లీజుదారులు అటు అధికార, ఇటు ప్రతిపక్ష నేతలకు దగ్గరగా ఉండడంతో దీనిపై ఎవరూ నోరుమెదపడం లేదని తెలుస్తోంది. పైగా ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ప్రకాశం గంజ్ ఓనర్స్ అసోసియేషన్ పేరిట ఈ వ్యవహారాన్ని మూమూలుగా నడిపిస్తున్నారు. ఇతరులకు అద్దె.. ఈదుకాణాలలోని 8 షటర్లకు పైగా లీజుదారులు ఇతరులకు రూ.15వేల చొప్పున అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. 25 ఏళ్ల ఒప్పందంలో మున్సిపల్ పన్నులు పెరుగుదలకు అనుగుణంగా అద్దె పెంచాలని పేర్కొన్నా ఒక్కసారి కూడా అద్దె పెంచలేదు. సర్కార్ నిర్ణయంలోని అద్దెకనుగుణంగా 21 షటర్లు మొత్తంగా రూ.37.35 లక్షల అద్దె బకాయిపడినా చెల్లించలేదు. గడువు ముగిసినా మార్కెట్ ధరకు అనుగుణంగా అద్దె పెంచకపోవడంతో రూ.2కోట్లకు పైగా ఎగ్గొట్టారు. ఇదీ కాకుండా రూ.1365 నామమాత్రపు అద్దెను ప్రభుత్వానికి చెల్లిస్తూ ఇతరులకు రూ.15 వేల చొప్పున షట్టర్లను అద్దెకిచ్చి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇందులో ఆర్అండ్బీ, విద్యాశాఖాధికారులకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ‘కదలరు..వదలరు., అద్దె షట్టర్ల వ్యవహారంలో నేతల జోక్యం..’ శీర్షికన వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో లీజుదారులు సమావేశమైనట్లు తెలిసింది. అటు నేతలతో పైరవీలు చేయిస్తూ రాజకీయ రంగు పులుముతూనే.. అధికారులకిచ్చే మామూళ్ల విషయంలో ఒక్కటై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది ఆర్అండ్బీ పరిధిలో ఉందని విద్యాశాఖ.. వారి పరిధిలోనే ఉందని ఆర్అండ్బీ శాఖ చేతులెత్తేస్తోంది. దీన్ని వ్యాపారులు తమకు కలిసివచ్చేలా మలుచుకుంటున్నారు. లీజుదారులు వీరే అయినా...! గంజ్హైస్కూల్ షటర్లలో 21దుకాణాలను లీజుకిచ్చారు. 1983 నుంచి 2008 జనవరి వరకు ఒప్పందంలో కేటాయించిన లీజుదారులు ఇలా ఉన్నారు. డి.లక్ష్మీనారాయణ, ఎండీ.షాదాత్ఖాన్, డి.పాపయ్య, సీహెచ్.బాలనర్సమ్మ, ఎన్.రాజయ్య, ఆర్.రాజేశం, ఎస్.రాములు, జి.శంకరయ్య, జె.రాధమ్మ, వి.ధనలక్ష్మి, వి.ఈశ్వరమ్మ, జి.సుగుణమ్మ, జి.రాజిరెడ్డి, బి.వరలక్ష్మి, కె.సత్తయ్య. ఇ.వీరేశం, బి.కైలాసం, టి.చంద్రమౌళి, ఎన్.వెంకటేశం, సి.హెచ్.దామోదర్‌రావు, నీరజకు కేటాయించారు. ఇందులో 10మంది మాత్రమే దుకాణాలను నడిపిస్తుండగా.. మిగిలిన వాటిలో కొడుకులు, మనవళ్లు, ఇతరుల పేరు మీద అద్దెకిచ్చి కొనసాగిస్తున్నారు. సాధ్యమైనంతలో... –రాఘవాచార్యులు, ఆర్అండ్బీ ఈఈ జీవో ప్రకారం గంజ్హైస్కూల్ షట్టర్లు విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. టెక్నికల్‌గా బిల్డింగ్ బాధ్యతలకై గతంలో ఐదేళ్లు మాత్రమే ఆర్‌అండ్‌బీలో పరిధిలో ఉంది. ఆ తర్వాత విద్యాశాఖ ఆ ఆస్తులను తమ పరిధిలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే వ్యాపారులు కోర్టును ఆశ్రయించారు. మేము కూడా పిటిషన్ దాఖలు చేశాం. సాధ్యమైనంత వరకు షట్టర్లను టేక్ఓవర్ చేసుకునేలా చర్యలు తీసుకుంటాం. -
రూ.115 కోట్లు నొక్కేశారు !
గన్నీల పేరిట రైస్ మిల్లర్ల చిలక్కొట్టుడు 2009 నుంచి పౌరసరఫరాల శాఖకు 2.84 కోట్ల గన్నీ బ్యాగుల బాకీ మిల్లర్లకు తొత్తులుగా మారిన పౌరసరఫరాల శాఖ అధికారులు ముక్కుపిండి వసూలు చేయాలని కమిషనర్ నిర్ణయం రేపు హైదరాబాద్‌లో డీఎం, డీఎస్వోలతో సీవీ ఆనంద్ సమీక్ష సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) అందించకుండా ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టిన రైస్ మిల్లర్లు గన్నీ సంచుల విషయంలోనూ కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. గన్నీ బ్యాగే కదా!...అదేం భాగ్యం అనుకుంటున్నారా?....ఒకటి, రెండు బ్యాగులు కాదు సుమా...ఏకంగా 2.84 కోట్లకుపైగా గన్నీ బ్యాగులను మిల్లర్లు నొక్కేశారు. వీటి ఖరీదెంతో తెలుసా....రూ.115 కోట్లు. అక్షరాల నూటా పదిహేను కోట్ల రూపాయలు. 2009 నుంచి నేటి వరకు దాదాపు ఏడేళ్లుగా పౌరసరఫరాల సంస్థకు గన్నీలను అప్పగించకుండా తమ జేబులో వేసుకుంటున్నారు. ప్రతి ఏటా సీజన్ అయిపోయిన వెంటనే గన్నీ బ్యాగులను స్వాధీనపర్చుకోవాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆ విషయాన్నే మర్చిపోయారు. మిల్లర్లకు తొత్తులుగా మారారు. వాళ్లిచ్చే అమ్యామ్యాలకు కక్కుర్తి పడ్డారు. అంతిమంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చే పనికి ఒడిగట్టారు. అడుగడుగునా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్న ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టికి గన్నీల వ్యవహారం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ఎన్నీ గన్నీ సంచులు బకాయి పడ్డారు? వాటి విలువ ఎంత? అని లెక్కలేసే పనిలో పడ్డారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం...రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.45 కోట్ల గన్నీ సంచులు మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు బకాయిపడ్డట్లు తేలింది. వాటి విలువ ఏకంగా రూ.203 కోట్లుగా నిర్దారించారు. అందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.115.99 కోట్లు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించిన అనంతరం వాటిని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఖరీఫ్, రబీసహా ప్రతి సీజన్లో మిల్లర్లు అడిగనన్ని గన్నీ బ్యాగులను అందిస్తున్నారు. వాస్తవానికి ఏ మిల్లర్‌కు ఎంత ధాన్యం అప్పగిస్తామో...అందుకు అవసరమైన గన్నీ బ్యాగులను మాత్రమే సరఫరా చేయాలి. అందులో సగం కొత్తవి, సగం పాతవి అందజేయాలి. కానీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు మిల్లర్లంటే వల్లమాలిన ప్రేమ. మిల్లర్లు ఎన్ని గన్నీ బ్యాగులు అడిగితే అన్ని ఇచ్చేస్తున్నారు. పైగా ఇష్టమైన మిల్లర్లు కదా! అని దాదాపు ప్రతి ఏటా ఎక్కువ శాతం కొత్త గన్నీ బ్యాగులే సరఫరా చేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మిల్లర్లకు 2,84,78,892 గన్నీ బ్యాగులను సరఫరా చేసినట్లు లెక్క తేలింది. వీటిలో 1,52,79,139 గన్నీ బ్యాగులు కొత్తవే. ఒక్కో కొత్త గన్నీ బ్యాగు ధర రూ.50 లు. ఈ లెక్కన వీటి ఖరీదు రూ.76.40 కోట్లు. ఇవిపోగా మిగిలిన 1,31,99,753 గన్నీ బ్యాగులు ఒకసారి వాడినవి. వీటికి సంబంధించి ఒక్కో బ్యాగు ఖరీదు రూ.30లుగా లెక్కకట్టిన అధికారులు రూ.39.60 కోట్లుగా నిర్దారించారు. పాత, కొత్త గన్నీ బ్యాగుల ఖరీదు రూ.115.99 కోట్లుగా లెక్కించారు. ఇంత పెద్ద మొత్తంలో గన్నీ బ్యాగులు బకాయి పడినా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్ధకంగా మారింది. రైస్ మిల్లర్లంతా అంటకాగుతూ వారిచ్చే అమ్యామ్యాలకు ఆశపడి సంస్థకు రావాల్సిన బకాయిలను వసూలు చేయకుండా మిన్నుకుండిపోయారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పౌరసరఫరాల సంస్థ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం హైదరాబాద్‌లో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, డీఎస్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. గన్నీ బ్యాగుల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతోపాటు ఆ మొత్తాన్ని ఏ విధంగా వసూలు చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ముగిసిన సీఎమ్మార్ గడువు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లర్లకు ఇచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) గడువు ముగిసింది. జిల్లాలోని మిల్లర్లకు 2015–16 సంవత్సరానికి గాను 604679 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంస్థ అప్పగించింది. వాటిని మరగా ఆడించి 407297 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(67 శాతం) సంస్థకు అందించాల్సి ఉంది. అయితే సీఎవ్మూర్ అప్పగించేందుకు నెలల తరబడి మొండికేసిన మిల్లర్లు సీవీ ఆనంద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక కొరడా ఝుళిపించారు. దీంతో ఇప్పటి వరకు 405350 మెట్రిక్ టన్నుల (99.52 శాతం) బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అప్పగించారు. ఇంకా 1947 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. మిల్లర్లకు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నందున కమిషనర్ సకాలంలో సీఎమ్మార్ అప్పగించిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
శ్వేతహోటల్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
వరుసగా ఐదోసారి ఎంపిక కరీంనగర్ బిజినెస్: నగరంలోని శ్వేత హోటల్‌కు ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించినట్లు మేనేజర్ తోట కోటేశ్వర్ చెప్పారు. బుధవారం హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టూరిజం శాఖ మంత్రి చందూలాల్, చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి చేతుల మీదుగా మంగళవారం అవార్డు అందుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకే ఈ అవార్డు దక్కిందన్నారు. వరుసగా ఐదోసారి అవార్డుకు ఎంపికవడంపై హర్షం వ్యక్తంచేశారు. సమావేశంలో మేనేజర్ యంసాని వేణుగోపాల్, పురుషోత్తం రెడ్డి, కృష్ణకుమార్, సతీశ్, శ్రీనివాస్, మూర్తి, ప్రశాంత్‌రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
జోరువాన
-
జోరువాన
జిల్లాలో విస్తారంగా వర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు.. మతyì దుముకుతున్న చెరువులు హుస్నాబాద్ పట్టణం జలమమం ఎల్లంపల్లి నాలుగు గేట్లు ఎత్తివేత ఎగువ, దిగువ మానేరుకు పెరిగిన వరద అధికార యంత్రాంగం అప్రమత్తం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు 1800 4254 731, 0878–2244300 కరీంనగర్ అగ్రికల్చర్ : అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నమెున్నటి దాకా కరువుతో అల్లాడిన జిల్లాలో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు నిండి మత్తళ్లు దుముకుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సైదాపూర్ మండలంలో 15.8 సెంటీమీటర్లు, హుస్నాబాద్‌లో 15, భీమదేవరపల్లిలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం జోరందుకుంది. హుస్నాబాద్, కమలాపూర్, కరీంనగర్‌తోపాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20టీఎంసీల గరిష్ట నీటిమట్టం ఉండగా, భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి గోదావరినదిలోకి నీటిని వదిలారు. రాత్రివరకు ఇన్‌ఫ్లో 23,806 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8,382 క్యూసెక్కులుగా ఉంది. మోయతుమ్మద వాగుతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, ఈదుల వాగులు పొంగిపొర్లుతున్నాయి. మోయతుమ్మదవాగు నిండుగా ప్రవహిస్తుండటంతో కోహెడ మండలం బస్వాపూర్ వద్ద హుస్నాబాద్–సిద్దిపేట మధ్య రాకపోకలు బందయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం ఎల్ఎండీలో ప్రస్తుతం 6టీఎంసీల నీళ్లుండగా, వాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మెదక్ జిల్లాలో కురిసి భారీ వర్షంతో కూడవెళ్లి వాగు ఉప్పొంగింది. దీంతో మెున్నటిదాకా ఎడారిని తలపించిన ఎగువమానేరు జలాశయం నిండుతోంది. 32 అడుగుల సామర్థ్యమున్న ఎగువమానేరులో 24 అడుగుల వరకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే శనివారంలోగా ఎగువమానేరు పూర్థిస్థాయిలో నిండే అవకాశముంది. శనిగరం జలాశయం సామర్థ్యం 42 అడుగులు కాగా, 13 అడుగులకు నీరు చేరింది. 28 అడుగులకు మత్తడి పడనుంది. 2013 సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడే జలకళ సంతరించుకుంటోంది. ముస్తాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లిలో వరద ఉధృతితో సిద్దిపేట–ముస్తాబాద్ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. చీకోడు జెడ్పీహైస్కూల్ ఆవరణలో నీళ్లు నిలిచి చెరువును తలపిస్తుండటంతో సెలవు ప్రకటించారు. యంత్రాంగం అప్రమత్తం.. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది సెలవు పెట్టరాదని, అనుమతి లేకుండా కరీంనగర్‌ను వదిలి వెళ్లరాదని కలెక్టర్ నీతూప్రసాద్ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్‌రూం.. ప్రజల సహాయార్థం కలెక్టరేట్లోని ఇన్స్టాక్స్ గదిలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. ఆస్తి, ప్రాణ, పంట నష్టం, వరదల సహాయార్థం కంట్రోల్ రూంలోని హెల్ప్‌లైన్ నంబర్ 1800 4254 731, 0878–2244300 నంబరు ఫోన్ చేయాలని సూచించారు. కంట్రోల్‌రూంలో 24 గంటల సౌకర్యంతో అధికారులను షిప్టులవారీగా నియమించారు. వీరు ప్రజల సమస్యలను ఫోన్లో స్వీకరించి ఆయా ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపడతారు. మండలాల వారీగా వర్షపాతం ముత్తారం, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మపురి, రామడుగు మండలాల్లో లోటు వర్షపాతమే నమోదయ్యింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ముస్తాబాద్‌లో 8.5, సిరిసిల్లలో 8, గంభీరావుపేటలో 4.4, ఎల్లారెడ్డిపేటలో 3.7, వేములవాడలో 6.4, బోయినపల్లిలో 2.2, చందుర్తిలో 3.1, ఇల్లంతకుంటలో 3, కోనరావుపేటలో 3.2, శ్రీరాంపూర్‌లో 3.8, ధర్మారంలో 5.6, ఓదెలలో 3.6, కాటారంలో 2.7, కమలాపూర్‌లో 6.4, ఎల్కతుర్తిలో 5.8, కోహెడలో 5.6, బెజ్జంకిలో 4.7, హుజూరాబాద్‌లో 6.8, జమ్మికుంటలో 6, చిగురుమామిడిలో 7.1, వీణవంకలో 5.5, కేశవపట్నంలో 9.2, ఇబ్రహీంపట్నంలో 3.5, మెట్పల్లిలో 2.6, సారంగాపూర్‌లో 2.2, జగిత్యాలలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. -
21న జాబ్‌మేళా
కరీంనగర్ అర్బన్: హైదరాబాద్‌కు చెందిన కాల్హెల్త్ సర్వీసెస్ ప్రై వేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల నియామకాల కోసం ఈ నెల 21న ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరీంనగర్‌లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సీహెచ్.ఉమారాణి తెలిపారు. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత కలిగి పదేళ్ల అనుభవం ఉన్న 20నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులని పేర్కొన్నారు. విద్యార్హత, అనుభవం సర్టిఫికెట్లతో ఇంటర్వూ్యలకు హాజరుకావాలని సూచించారు. ఎంపికైనవారికి రూ.20వేల నుంచి 24వేల వేతనం ఉంటుందని పేర్కొన్నారు. -
తెలంగాణ స్వాతంత్య్రాన్ని మరుస్తున్న సర్కార్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరీంనగర్ : తెలంగాణ రైతాంగసాయుధ పోరాటంతో వచ్చిన తెలంగాణ స్వాతంత్య్ర దినం సెప్టెంబర్ 17ను కేసీఆర్ సర్కార్ పూర్తిగా విస్మరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని నల్గొండలో ప్రారంభమైన బస్సుయాత్ర బుధవారం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణసాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అక్కడినుంచి బైక్‌ర్యాలీగా అనభేరి విగ్రహం వరకు బయలుదేరారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో చాడవెంకటరెడ్డి మాట్లాడారు. నిజాం రాచరిక వ్యవస్థ కూలదోసి స్వాతంత్య్రాన్ని పొందడానికి నాడు బద్దం ఎల్లారెడ్డి, మఖ్దుం మెుయినొద్దీన్, రావినారాయణరెడ్డి తెలంగాణసాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. దీంతో గ్రామగ్రామాన ప్రజలు ఎర్రజెండాలు పట్టుకుని సాయుధ పోరాటంలో ముందుకు సాగారని పేర్కొన్నారు. జిల్లాలో బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి వంటి విప్లవవీరులు పోరాటంలో పాల్గొని ప్రజల్ని ఉద్యమంవైపు నడిపించారన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు. చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ తిరంగాయాత్ర పేరుతో హంగామా చేస్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, మహిళా సమాఖ్య, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ఎన్.జ్యోతి, రావి శివరామకష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, నాయకులు పల్లె నర్సింహ, ఉప్పలయ్య, మారుపాక అనిల్, అంజయ్య, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కాల్వనర్సయ్య, పంజాల శ్రీనివాస్, ముల్కల మల్లేశం, టేకుమల్ల సమ్మయ్య, బోయిని అశోక్, పొనుగంటి కేదారి, అందెస్వామి, సృజన్‌కుమార్, గడిపె మల్లేష్ పాల్గొన్నారు.