శ్వేతహోటల్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
-
వరుసగా ఐదోసారి ఎంపిక
కరీంనగర్ బిజినెస్: నగరంలోని శ్వేత హోటల్‌కు ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించినట్లు మేనేజర్ తోట కోటేశ్వర్ చెప్పారు. బుధవారం హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టూరిజం శాఖ మంత్రి చందూలాల్, చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి చేతుల మీదుగా మంగళవారం అవార్డు అందుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకే ఈ అవార్డు దక్కిందన్నారు. వరుసగా ఐదోసారి అవార్డుకు ఎంపికవడంపై హర్షం వ్యక్తంచేశారు. సమావేశంలో మేనేజర్ యంసాని వేణుగోపాల్, పురుషోత్తం రెడ్డి, కృష్ణకుమార్, సతీశ్, శ్రీనివాస్, మూర్తి, ప్రశాంత్‌రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.