ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాగే ఫుడ్‌కు సంబంధించి కూడా పోటీ ఉంది. ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పోటీలో ఫుడ్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఔత్సాహిక , ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లకు బహుమతులను ప్రదానం చేస్తుంది.
ఫుడ్ ఫర్ సేల్, ఫుడ్ ఫర్ ఫ్యామిలీ,ఫుడ్ ఇన్ యాక్షన్ ఇలా పలు కేటగిరీల్లో బహుతులను అందిస్తుంది. పింక్ లేడీ మూమెంట్స్‌తో పాటు మహిళా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి.
ఇథియోపియాలోని ఒక గ్రామంలో కరో తెగకు మహిళలు స్టోన్ గ్రైండర్లతో బియ్యం ముద్ద తయారు చేస్తున్న చిత్రం. తీసింది ఇండియాకు చెందిన సంఘ మిత్ర సర్కార్. ఇది షార్ట్ లిస్ట్ అయింది.
ఫుడ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పేరుతో ఉత్తమ అవార్డును ఇస్తుంది. ఈ క్రమంలో వెజిటబుల్ మ్యాన్ చిత్రాన్ని బ్రిటన్‌కు చెందిన కేరొలీన్ తీసిన ఫోటో విశేషంగా నిలుస్తోంది. ఈ చిత్రం ఫుడ్ ఫొటోగ్రఫీ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది.
వెజిటబుల్ మ్యాన్
13వ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది ఫోటోలు పోటీ పడుతున్నాయి. ఫైనలిస్టుల ఫోటోలను లండన్‌లోని ది మాల్ గ్యాలరీస్‌లో ప్రదర్శిస్తారు. జూన్ 4న లండన్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేత 5వేల యూరోలను బహుమతి గెల్చుకోవచ్చు.
ఫుడ్ ఫర్ సేల్ కేటగిరీ
టిప్ ట్రీ కేక్, వైన్ ఫోటోగ్రఫీ
Comments
Please login to add a commentAdd a comment