బ్రిటన్‌లోని కొందరికి మొన్నటి ఆదివారం మరపురానిదిగా మిగిలిపోతుంది. ప్రిన్స్ విలియం లండన్‌లో ఒక ఫుడ్ ట్రక్ నుంచి పర్యావరణానికి హాని చేయని బర్గర్లను కొందరికి పంచిపెట్టారు. ఇది చూపరులను ఎంతగానో ఆశ్ఛర్యపరిచింది. వార్షిక ఎర్త్‌షాట్ పురస్కారాల పంపిణీలో భాగంగా గత ఏడాది విజేతలకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘ఎర్త్‌షాట్ బర్గర్ల’ను అందించారు. ఈ పురస్కారాలను పర్యావరణానికి విశేషమైన సేవలు అందించిన ఐదుగురికి అందజేశారు.
దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ చానల్ సార్టెడ్ ఫుడ్‌లో షేర్ చేశారు. ఈ చానల్‌లో పర్యావరణ అనుకూలమైన వంటగది పరికరాలు, రకరకాల వంటకాల తయారీ విధానాలు కనిపిస్తాయి. వీడియో ప్రారంభంలో ప్రిన్స్ విలియం సార్టెడ్ ఫుడ్‌కు సంబంధించిన స్టూడియోకి చేరుకుంటారు. గత ఏడాది ఎర్త్‌షాట్ పురస్కార విజేతలు రూపొందించిన వాటిని ఒక వ్యక్తి పట్టుకుని ఉంటాడు. తరువాత బర్గర్ తయారు చేస్తుంటారు. ప్రిన్ ఆ డిష్ తీసుకుని జనం మధ్యలోకి చేరుకుంటారు.
వీడియోలో ఫుడ్ ట్రక్ దగ్గర ప్రిన్స్ విలియం నిలుచుని, మీరు తినబోయే కంటైనర్‌ను నోట్‌ప్లా అనే కంపెనీ తయారు చేసిందని, దీనిలో ఎలాంటి ప్లాస్టిక్‌ను ఉపయోగించలేనది వినియోగదారులకు ఆయన చెప్పడాన్ని వినవచ్చు. ఈ కంటైనర్లకు సముద్రపు పాచితో తయారు చేస్తారు.
బర్గర్‌లోని పదార్థాలను భారతదేశంలోని ఖేతీ అనే సంస్థ గ్రీన్‌హౌస్‌లలో ఉత్పత్తి చేసిందని ప్రిన్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. ముకూరు క్లీన్ స్టవ్‌పై బర్గర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కెన్యాకు చెందిన ఓ మహిళ ఈ స్టవ్‌ను డిజైన్ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ఉత్పాదన లక్ష్యం.
ఇది కూడా చదవండి: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం
Comments
Please login to add a commentAdd a comment