Photography Day
-
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ‘సాక్షి’ స్పెషల్ ఫొటోలు
-
ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?
ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాగే ఫుడ్‌కు సంబంధించి కూడా పోటీ ఉంది. ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పోటీలో ఫుడ్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఔత్సాహిక , ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు బహుమతులను ప్రదానం చేస్తుంది. ఫుడ్ ఫర్ సేల్, ఫుడ్ ఫర్ ఫ్యామిలీ,ఫుడ్ ఇన్ యాక్షన్ ఇలా పలు కేటగిరీల్లో బహుతులను అందిస్తుంది. పింక్ లేడీ మూమెంట్స్‌తో పాటు మహిళా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ఇథియోపియాలోని ఒక గ్రామంలో కరో తెగకు మహిళలు స్టోన్ గ్రైండర్లతో బియ్యం ముద్ద తయారు చేస్తున్న చిత్రం. తీసింది ఇండియాకు చెందిన సంఘ మిత్ర సర్కార్. ఇది షార్ట్ లిస్ట్ అయింది. ఫుడ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పేరుతో ఉత్తమ అవార్డును ఇస్తుంది. ఈ క్రమంలో వెజిటబుల్ మ్యాన్ చిత్రాన్ని బ్రిటన్‌కు చెందిన కేరొలీన్ తీసిన ఫోటో విశేషంగా నిలుస్తోంది. ఈ చిత్రం ఫుడ్ ఫొటోగ్రఫీ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది. వెజిటబుల్ మ్యాన్ 13వ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది ఫోటోలు పోటీ పడుతున్నాయి. ఫైనలిస్టుల ఫోటోలను లండన్‌లోని ది మాల్ గ్యాలరీస్‌లో ప్రదర్శిస్తారు. జూన్ 4న లండన్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేత 5వేల యూరోలను బహుమతి గెల్చుకోవచ్చు. ఫుడ్ ఫర్ సేల్ కేటగిరీ టిప్ ట్రీ కేక్, వైన్ ఫోటోగ్రఫీ 👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం..సాక్షి ఫోటో జర్నలిస్టులకు సన్మానం
-
డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి ఆల్బమ్‌లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది. జ్ఞాపకాల ఖజానా టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్‌హాసన్‌కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్ డిజిటల్ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. మల్లేశ్వరరావు వీడియో కెమెరాల్లో ఎన్ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్ కెమెరాలతో పాటు సరికొత్త 7డీ, 70డీ, ఫోర్‌కె, గోప్రో, గింబల్, స్లైడర్ తదితర కెమెరాలను సేకరించారు. విహంగాలతో దోస్తీ జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. కిశోర్ తీసిన పక్షుల చిత్రాలు జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. -
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సాక్షి అందిస్తున్న అద్బుతమైన ఫోటోలు
-
ఆ ఒక్కటి చాలు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి!
ఇప్పుడు అందరి సెల్‌ఫోన్స్‌లో కెమెరాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా ఏది కనిపించినా వెంటనే క్లిక్మనిపించేస్తున్నాము. తీసిన ఫోటోలను క్షణాల్లోనే సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రపంచంతో పంచుకుంటున్నాము. అయితే బెస్ట్ ఫోటో గ్రాఫర్ కావాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఫోటోలను ఏవిధంగా తీయాలో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోను క్లిక్ చేయండి. -
ఫొటోగ్రాఫర్లందరికీ ఇళ్ల స్థలాలు
దావణగెరె : నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతి సదుపాయం కల్పించే ఉద్దేశంతో తగిన ఖాళీ స్థలం కోసం అన్వేషిస్తున్నామని, తగిన స్థలం లభించిన వెంటనే ఫొటోగ్రాఫర్లందరికీ ఆశ్రయ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన నగరంలోని రేణుకా మందిరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆశ్రయ ఇళ్లు కేటాయించే ప్రక్రియను 2002లో నిలిపి వేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా పెరిగిందని, భూమి ధరలు కూడా పెరిగాయన్నారు. అందువల్ల భూముల కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఫొటోగ్రాఫర్ల కుటుం బ సభ్యులకు ప్రత్యేక కేటగిరి కింద స్కాలర్షిప్లు అందిస్తున్నారని, ఫొటోగ్రాఫర్లకు త్వరలో ఇళ్ల స్థలాలు కల్పిస్తామన్నారు. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ఫొటోగ్రాఫర్ లక్షలాది రూపాయలు వెచ్చించి కెమేరాలు కొనుగోలు చేస్తున్నారని, అయితే అం దుకు తగిన సంపాదన లభించడం లేదన్నారు. ఫొటోగ్రాఫర్లకు అన్ని రకా ల సాయం అందించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్ బాబణ్ణ ను సన్మానించగా, జిల్లాధికారి డీఎస్ రమేష్, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్ జాధవ్, ఉపాధ్యక్షుడు నాగేష్, జిల్లా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు శికారి శంభు, డీ.శివకుమార్, వివిధోద్దేశ సంఘం జిల్లా అధ్యక్షుడు పాటిల్, దేవరాజ్, అంబాస్, శివణ్ణ, సతీష్ పవార్, శివలింగప్ప, రామచంద్ర, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మీడియా సెంటర్ ఏర్పాటుకు కృషి
ఖమ్మం కల్చరల్, న్యూస్‌లైన్: ఖమ్మంలో జిల్లా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్ తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక స్వర్ణభారతి కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న కాలంతోపాటు ఫొటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటో మొదలు స్టిల్ ఫొటోగ్రఫీ, మూవ్‌మెంట్స్‌ను టేకప్ చేసే విధానం నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అందివచ్చిన సాంకేతికతతో విస్త్రృతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. హాబీగా ఫొటోగ్రఫీని మొదలుపెట్టి ప్రొఫెషనల్‌గా తయారైన వాళ్లూ ఉన్నారన్నారు. ఇండియాలోనే కాకుండా అమెరికాలోనూ తాను ఓ సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశానన్నారు. జర్నలిజానికి, ఫొటోగ్రఫీకి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆయన వివరించారు. మీడియాకు మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడేలా జిల్లా కేంద్రంలో ఓ మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ సెంట ర్ను కేవలం డీపీఆర్ఓ ఆఫీసులో కాకుండా ఓ పెద్దభవనం లేదా ఆడిటోరియంలో ఏర్పాటు చేసి శాశ్వతంగా ఉపయోగపడేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఏ అసోసియేషన్ అయినా ఈ మీడియా సెంటర్‌ను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు ఉండాలనుకుంటున్నామన్నారు. మీడియా కేంద్రంలో ఎడిటింగ్ సౌలభ్యం కూడా కల్పిస్తే బాగుటుందన్నారు. వచ్చే అక్టోబర్ నాటికి జిల్లా ఏర్పడి 60 ఏళ్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ప్రజల వద్ద ఉన్న అరుదైన క్లిప్పింగ్స్‌ను సేకరించి ఓ చక్కని ఆల్బమ్ తయారు చేయాలనుకుంటున్నామన్నారు. దీనికోసం డీపీఆర్ఓ ప్రత్యేక ప్రణాళిక రూపొం దించారన్నారు. ఫొట్రోగాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌కు వృత్తిపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాలను వారోత్సవంగా నిర్వహిస్తే బాగుటుందని ఎస్పీ రంగనాథ్ సూచిం చారు. సమ్మర్‌క్యాంప్‌లు, హాలిడే ట్రైనింగ్‌లు నిర్వహించి పిల్లలకు సైతం ఫొటోగ్రఫీపై అవగాహన కల్పించాలని కోరారు. ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా నాయకుడు షేక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, డీపీఆర్ఓ వై. వెంకటేశ్వర్లు, మమత మెడికల్ కళాశాల చైర్మన్ పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల నర్సిం హారావు, పి.నాగేంద్రబాబు, గౌరవ అధ్యక్షులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మమత మెడికల్ కళాశాల సహకారంతో పలువురు ఫొటోగ్రాఫర్లు రక్తదానం చేశారు. సీనియర్ ఫొటోగ్రాఫర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్రీనివాస్, కమటం శ్రీను, హరి(సత్తుపల్లి), గడ్డం శ్రీనివాస్, జనార్దన్ (నేలకొండపల్లి), జాకీర్‌హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులను కలెక్టర్, ఎస్పీ సన్మానించారు.