జెంటిల్మెన్ ఒప్పందం
జెంటిల్మెన్ ఒప్పందం
Published Mon, Sep 26 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
అమలాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం వ్యవహారం
రెండేళ్లు గణేష్‌కు, మిగిలిన కాలానికి సతీష్
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిలిపివేయాలంటూ 29న హైకోర్టులో రిట్
నేటి కోర్టు విచారణపై ఉత్కంఠ
ఓవైపు జెంటిల్మెన్ ఒప్పందం కోసం స్థానిక దివంగత మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు నివాసంలో చర్చలు జరుగుతుండగానే, పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు గారపాటి మార్తాండ 29న జరిగే చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలంటూ సోమవారం హైకోర్టులో రిట్ వేశారు. మున్సిపల్ చైర్మన్ మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన నాలుగో వార్డుకు ఎన్నిక నిర్వహించకుండా, చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించరాదని.. ఇది మున్సిపల్ బైలాకు విరుద్ధమంటూ కోర్టును ఆశ్రయించారు. ఇదే విషయమై టీడీపీ కార్యకర్త మామిడిపల్లి సాయిబాబు కూడా చైర్మన్ ఎన్నికను నిలిపివేయాలం టూ హైకోర్టులో రిట్ వేశారు. సాయిబాబు వేసిన రిట్‌పై దసరా సెలవుల తర్వాత విచారణకు వాయిదా వేస్తే, మార్తాండ వేసిన రిట్‌ను మంగళవారం విచారణ చేయనున్నట్టు హైకోర్టు పేర్కొంది. దీంతో చైర్మన్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జెంటిల్మెన్ ఒప్పందాన్ని సూచించిన రాజప్ప
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరుగుతున్న కసరత్తు, గణేష్, సతీష్ మధ్య జరుగుతున్న పదవీ పందేరంపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం చేసుకుని, జెంటిల్మెన్ ఒప్పందంతో ఆ అంశానికి తెరదించారు. దీంతో ఎమ్మెల్యే ఆనందరావు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, కౌన్సిలర్లు, పట్టణ టీడీపీ శ్రేణుల సమక్షంలో ఆ పదవి కోసం పోటీ పడుతున్న గణేష్, సతీష్‌కు సోమవారం ఈ ఒ ప్పందాన్ని వివరించారు. ఇందుకు గణేష్, సతీష్ అంగీకరించారు. దీంతో 29న జరిగే చైర్మన్ ఎన్నికకు గణేష్ ఒక్కరినే చైర్మన్ అ భ్యర్థిగా ఎంపిక చేశారు. ఒకే అభ్యర్థి కావడంతో చైర్మన్‌గా గణేష్ ఎన్నిక ఇక లాంఛనమేనని అంతా అనుకున్నారు. ఎన్నిక నిలిపివేతపై వేసిన రిట్‌తో ఉత్కంఠ అనివార్యమైంది. నాలుగో వార్డు నుంచి మల్లేశ్వరరా వు తనయుడు సతీష్ ఎన్నికై, చైర్మన్ పదవి చేపట్టాలని ఆశించారు. మూడేళ్లు మల్లేశ్వరరావు, రెండేళ్లు గణేష్ చైర్మన్లుగా పనిచేసేం దుకు 2014 మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగిన ఒప్పందంతో పాటు మల్లేశ్వరరావు మృతితో ఖాళీ అయిన చైర్మన్ పీఠాన్ని గణేష్ ఆశించారు. 29న జరిగే ఎన్నికలో గణేష్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారో, మంగళవారం నాటి హైకోర్టు విచారణతో ఎన్నిక వాయిదా పడుతుందో, ఎన్నిక నిర్వహించుకోవచ్చో తేలాలంటే వేచిచూడాల్సిందే.
Advertisement
Advertisement