సాగు కనెక్షన్లకు జియోట్యాగింగ్
సాగు కనెక్షన్లకు జియోట్యాగింగ్
Published Wed, Sep 7 2016 11:57 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
– ఎస్‌ఈ భార్గవరాముడు
– 12లోగా పూర్తి చేయాలని ఆదేశం
కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను జియోట్యాగింగ్‌తో అనుసంధానించాలని విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్‌ఈ జి. భార్గవ రాముడు సూచించారు. స్థానిక కేవీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న పవర్ హౌస్‌లోని ఆయన కార్యాలయంలో బుధవారం డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జియోట్యాగింగ్ వ్యవస్థను ఈనెల 12వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రతి నెలా నిర్ణీత గడువులోగా స్పాట్ బిల్లింగ్ పూర్తి చేసి వసూలుపై దష్టి సారించాలని ఆదేశించారు. సంస్థ నిబంధనల ప్రకారం పాత బకాయిలను ప్రతి నెలా 10శాతం మేరకు వసూలు చేయాలన్నారు. అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేసి వర్క్ అర్డర్లు క్లోజ్ చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే గ్రామీణ ప్రాంతాల్లో 24గంటలు, పట్టణ ప్రాంతాల్లో 12గంటల్లోపు కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కర్నూలు–1, 2, రూరల్స్, గూడూరు, ఆత్మకూరు, నందికొట్కూరు ఏడీఈలు టీఎన్ ప్రసాద్, రంగస్వామి, నవీన్ బాబు, విజయసారథి, జయశంకర్, రామ సుబ్బారెడ్డి, ఏఈలు, ఏఏఓలు పాల్గొన్నారు.
Advertisement