డెంగీతో చిన్నారి మృతి
డెంగీతో చిన్నారి మృతి
Published Wed, Aug 3 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
ఆలూరు:
ఆలూరు గ్రామానికి చెందిన భూమిక (3) డెంగీ బారిన పడి మృతి చెందింది. గ్రామానికి చెందిన నాగార్జున, నాగవేణిలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె భూమికకు వారం రోజులుగా చలిజ్వరం, వాంతులు కావడంతోlస్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చిన్నారికి వైద్య పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని ప్రై వేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేయించారు. చికిత్స పొందుతున్న కోలుకోలేక చిన్నారి మంగళవారం మృతి చెందింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Advertisement