రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
Published Thu, Oct 6 2016 9:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
మఠంపల్లి : మండలంలోని మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు నిర్మించిన రైల్వేలైన్ నిర్మాణంలో గల పెండింగ్ భూములను గురువారం జిల్లా జేసీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు రైల్వేలైన్‌లో భూములు కోల్పోయిన రైతులకు పూర్తినష్టపరిహారం అందజేశామన్నారు. కాగా 7 ఎకరాల ఏడున్నర కుంటల పెండింగ్ భూములకు నష్ట పరిహారం చెల్లించాల్సిన భూములను పరిశీలించామన్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అనంతరం 7 ఎకరాల ఏడున్నర గుంటల రైతులకు కూడా నష్టపరిహారం అందజేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, ఆర్‌ఐ శైలజ, వీఆర్‌ఓ యాదయ్య, సిమెంట్ పరిశ్రమల అధికారులు, స్థానిక రైతులు ఉన్నారు.
Advertisement
Advertisement