హోటల్‌ను ప్రారంభిస్తున్న స్పీకర్ మధుసూదనచారీ
–స్పీకర్ మధుసూదనచారీ
షాద్‌నగర్: ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన వంటకాలు అందించాలని తెలంగాణ రాష్ట్రసభ స్పీకర్ మధుసూదన చారీ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని బైపాస్ జాతీయరహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌కేఆర్ రెసిడెన్సీ హోటల్ ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లే జాతీయ రహదారిలో ఆహ్లదకరమైన వాతావరణంలో హోటల్‌ను నిర్మించారన్నారు. ప్రయాణికులు విశ్రాంతి, భోజనం చేయడానికి హోటల్‌లో సౌకర్యాలు ఉన్నాయన్నారు. పోటీ ప్రపంచంలో చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. అలాంటి వారి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఇలాంటి హోటళ్లు ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లింగారం యాదమ్మ పెంటయ్య, నాయకులు వీర్లపల్లి శంకర్, నరేందర్, అందెబాబయ్య, గోపాల్‌గుప్త, చిల్కమర్రి సర్పంచ్ సుష్మా, సరళ, కౌన్సిర్ కష్ణవేణి, మహేశ్వరి, యుగంధర్, బచ్చలి నర్సింహ, కందివనం సూర్యప్రకాష్, దాద యజమాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.