![గ్రాము బంగారంతో గొబ్బెమ్మ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81452439511_625x300.jpg.webp?itok=4OA4uiT6)
గ్రాము బంగారంతో గొబ్బెమ్మ
తెనాలి (గుంటూరు): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రాము బంగారంతో ముగ్గు, గొబ్బెమ్మ, రెండు చెరకు గడలు రూపొందించాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బంగారు పని కార్మికుడు ఎం. సురేష్.
అలాగే, మరో గ్రాము బంగారంతో పడవ, తెడ్డును కూడా తయారు చేశాడు. వీటి తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని, 2011లో ప్రపంచ క్రికెట్ పోటీల సందర్భంగా వరల్డ్ కప్పును బంగారంతో రూపొందించానని చెప్పుకొచ్చాడు సురేష్. ఈ కళాకారుడి ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు.