ఉద్యోగి చేతివాటం.. బంగారం మింగేశాడు | gold swallowed by a endowment employee in vemulawada | Sakshi
Sakshi News home page

ఉద్యోగి చేతివాటం.. బంగారం మింగేశాడు

Published Wed, Jun 22 2016 1:42 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

ఉద్యోగి చేతివాటం.. బంగారం మింగేశాడు

ఉద్యోగి చేతివాటం.. బంగారం మింగేశాడు

వేములవాడ: ఆలయాల్లో హుండీల లెక్కింపు సమయంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. బంగారం, నగదును చోరి చేసి వాటిని దాచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు సమయంలో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం నుంచి హుండీ లెక్కింపు జరుగుతుండగా.. అందులో పాల్గొన్న కాంట్రాక్ట్ లేబర్ కనకయ్య బంగారం లెక్కిస్తున్న క్రమంలో..  కొత్త బంగారాన్ని మింగేశాడు. ఉంగరం, చెవికమ్మలు, చైన్ మింగినట్లు అధికారులు గుర్తించారు. ఆలయాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement