సవీర సేవలు బాగున్నాయి : ఎంపీ జేసీ | good Services are savira: mp jc | Sakshi
Sakshi News home page

సవీర సేవలు బాగున్నాయి : ఎంపీ జేసీ

Published Tue, Aug 2 2016 12:26 AM | Last Updated on Thu, Aug 9 2018 8:43 PM

good Services are savira: mp jc

అనంతపురం సిటీ  సవీరా హాస్పిటల్‌ యాజమాన్యం అందిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని ఎంపీ జేసీ దివాకరరెడ్డి కితాబిచ్చారు. సోమవారం ఉదయం సవీరా హాస్పిటల్‌లో ఎన్‌టీఆర్‌ వైద్య సేవల్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ రాజ్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అథితులుగా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, హాస్పిటల్‌ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు ఇకపై అనంతలో అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే ఐదేళ్లలో అనంతలో సవీర హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఒక మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాలని సూచించారు. మరో ఐదెకరాల స్థలం తీసుకుని ఉద్యానవనం కూడా ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాల్లోనే ఈ తరహా ఆస్పత్రి లేదని నిరుపించాలని యాజమాన్యానికి సలహా ఇచ్చారు. అనంతరం ఆయన ఎన్‌టీఆర్‌ వైద్య సేవల కేంద్రాన్ని ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement