రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
♦ కొత్వాల్‌గూడలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’
♦ ప్రారంభంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
శంషాబాద్ : రైతు సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అ న్నారు. కొత్వాల్‌గూడ గ్రామంలో ‘మన తెలంగాణ మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు విడతలుగా రైతుల రుణమాఫీని అమలుపర్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ‘మన తెలంగాన మన వ్యవసాయం’ ద్వారా రైతులకు అందించే సూచనలు, సలహాలను సద్వినియోగం చేసుకుని, అధిక పంట దిగుబడులను సాధించాలని ఆయన సూచిం చారు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న పం డ్లు, పూలు మన దగ్గరే పండించుకుని, రైతులు మరింత అభివృద్ధి సాధించాలని ఆయన అభిలషించారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులతో రైతుల జీవితాలు మెరుగుపడే రోజులు రానున్నాయన్నారు. వ్యవసాయశాఖ అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ సూచిం చారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లకు సంబంధించిన వారు పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు సతీష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రావణ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సురేష్‌గౌడ్, కొత్వాల్‌గూడ సర్పంచ్ గుర్రంపల్లి ప్రసన్న, ఉప సర్పంచ్ పత్తి నర్సింగ్‌రావు, శంషాబాద్ పీఏసీఎస్ చైర్మన్ కొలను మహేందర్‌రెడ్డి వ్యవసాయ అధికారులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.