‘చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు’ | Hugh funds for development of the pond :Mahendar reddy | Sakshi
Sakshi News home page

‘చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు’

Published Fri, Apr 15 2016 4:39 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Hugh funds for  development of the pond :Mahendar reddy

తెలంగాణ సర్కారు చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండల కేంద్రంలో మిషన్ కాకతీయ కింద రూ.66 లక్షలతో మంజురైన ఊర చెరువు పనులను ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం సాగునీటి రంగఅభివృద్ధికి ఊతమిస్తోందని అన్నారు. పూడిక తీతతో చెరువులు పుష్కలంగా నిండి ఏడాదికి రెండు పంటలు పండే అవకాశం ఉందని తెలిపారు. మండలంలోని 39 చెరువులకు రూ.17కోట్లు, తాండూరు- తోర్మామిడి రోడ్డు పనులకు రూ.27 కోట్ల నిధులు, తాండూరు రింగ్ రోడ్డు సర్వేకు రూ.80 కోట్లు మంజూరయ్యాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement