వరంగల్: కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని పలు కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఇలాంటి చర్యలు అనైతికమని హితవు పలికారు. ప్రభుత్వం, అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్కు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ స్వర్ణ వినతిపత్రం అందజేశారు.