ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే మరణాలు
Published Fri, Jul 14 2017 11:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ):
జ్వరాలతో మనుషులు చనిపోతున్నారంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి అన్నారు. వీరవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులు మరణించి తల్లి వెంకటలక్ష్మి చికిత్స పొందుతున్న సంఘటనకు సంబంధించి సాయి ఆసుపత్రిలో బాధితురాలిని ఆమె శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 మండలాల్లోను జ్వర పీడుతులతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. రోజురోజుకీ మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని మరణాలను చూడాల్సి వస్తుందన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 40 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యపోస్టుటలు భర్తీలేక వైద్యుల కొరత ఏర్పడిందన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని వచ్చి ఏమి చేశారని, కనీసం బాధితులను పరామర్శించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని, జ్వరాలతో జనం బాధపడుతున్నా ముఖ్యమంత్రి చలించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ మోహన్ రెడ్డి, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, నీలం గణపతి, కుక్క తాతబ్బాయి, వాకచర్ల కృష్ణ, ఉప్పాడ కోటరెడ్డి ఉన్నారు.
Advertisement