traibles
-
అడవి బిడ్డలను పొమ్మంటున్నారు
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో దేశంలోని 16 రాష్ట్రాల్లోని ఆదివాసీలు, గిరిజనులు, అడవిపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది తక్షణమే అడవి వదలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు ఆదివాసీల అటవీ హక్కుల చట్టానికి భిన్నమైన తీర్పు రావడం బీజేపీకి నష్టం చేకూరుస్తుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రాధాన్యాన్ని కోర్టులో సరిగ్గా వివరించని కారణంగానే ఆదివాసీలు నష్టపోవాల్సి వస్తుందని అపవాదును ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటవీ హక్కుల చట్టం–2006 చెల్లుబాటుకు సంబంధించిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్‌పై పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన వాజ్యంపై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పిటిషన్ దారుల్లో ఒకరైన నేచర్ కన్జర్వేషన్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ 2006 అటవీ హక్కుల చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించింది. అడవి విధ్వంసానికి, వన్యప్రాణులకు నష్టం చేస్తుందని పేర్కొంది. అటవీ హక్కుల చట్టంలో వాడిన అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్యుయెల్లర్స్ అనే కోవలోనికి ఎవరొస్తారన్న విషయంలో రాజ్యాంగంలోనే అస్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ ఆధారంగా ఇచ్చిన కోర్టు ఆదేశాల ప్రకారం అటవీ హక్కుల చట్టం పరిధిలో భూ యాజ మాన్య హక్కు దరఖాస్తుల తిరస్కరణకు గురైన దాదాపు 11 లక్షల మంది ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి జూలై 27లోగా ఖాళీ చేయించాలని కోర్టు స్పష్టం చేసింది. నిర్దాక్షిణ్యంగా తరిమికొడతారా? ఆదివాసీలపై అటవీశాఖ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆదివాసీల హక్కులు హరణకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఆ శాఖ ఎదుర్కొంటోంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూయాజమాన్య హక్కుల దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలను అడవి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టే ప్రయత్నం జరుగుతోంది. అటవీ ఉత్పత్తుల ద్వారా అటవీ శాఖకు వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడంతో ఆదివాసీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆదివాసీల హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2శాతం మందికే అనుమతి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ గణాంకాల ప్రకారం దేశం మొత్తం 42.19 లక్షల మంది భూ యాజమాన్య హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే 18.89 లక్షల మందినే అనుమతించారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారిని కూడా కలుపుకుంటే అడవి నుంచి నిర్వాసితులు కానున్న ఆదివాసీల సంఖ్య 23 లక్షలకు పైగానే ఉంటుంది. గోండూ, ముండా, డోంగ్రి యా తదితర ఆదివాసీలు తమ అటవీ భూములను బాగు చేసుకొని అందులో పండించుకునే అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి బతుకుతారు. ఇందులో 2 శాతం మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన వారంతా అక్రమంగా అటవీ ప్రాంతంలో సాగుచేసుకుంటున్న వారేనని అటవీ హక్కుల చట్టాన్ని బట్టి అర్థం అవుతోంది. అయితే కోర్టులో కేంద్రం ఆదివాసీల రక్షణ చట్టాన్ని సమర్థించుకోలేకపోయిందన్న విమర్శలొస్తున్నాయి. -
గిడ్డి ఈశ్వరి ఎన్ని కోట్లు తీసుకున్నారు?
సాక్షి, విజయనగరం : గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. గతంలో బాక్సైట్ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికోట్లు తీసుకుని పార్టీ మారారో ఆమె సమాధానం చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. గిడ్డి ఈశ్వరికి ఆత్మాభిమానం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ...‘ 2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాట్లోనే విన్నాం. వైఎస్ జగన్ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు చెప్పడం దురదృష్టకరం. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే...2014లో మీకు వైఎస్ జగన్ సీటు ఇచ్చారో చెప్పాలి. నిన్న, మొన్నటివరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు. గిరిజనులకు టీడీపీ సర్కార్ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు ... మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి...ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే మీరు పార్టీ మారారో చెప్పాలి. వైఎస్ఆర్ సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి.’ అని డిమాండ్ చేశారు. కాగా వైఎస్ఆర్ సీపీ జెండాపై గెలిచిన గిడ్డి ఈశ్వరి... సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకి సీటు దక్కకుండా చేయడం కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి రూ. 25 కోట్ల డీల్‌కు ఒప్పించినట్లు తెలిసింది. -
ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే మరణాలు
ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): జ్వరాలతో మనుషులు చనిపోతున్నారంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి అన్నారు. వీరవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులు మరణించి తల్లి వెంకటలక్ష్మి చికిత్స పొందుతున్న సంఘటనకు సంబంధించి సాయి ఆసుపత్రిలో బాధితురాలిని ఆమె శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 మండలాల్లోను జ్వర పీడుతులతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. రోజురోజుకీ మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని మరణాలను చూడాల్సి వస్తుందన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 40 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యపోస్టుటలు భర్తీలేక వైద్యుల కొరత ఏర్పడిందన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని వచ్చి ఏమి చేశారని, కనీసం బాధితులను పరామర్శించలేదన్నారు. వైఎస్సార్సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని, జ్వరాలతో జనం బాధపడుతున్నా ముఖ్యమంత్రి చలించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ మోహన్ రెడ్డి, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, నీలం గణపతి, కుక్క తాతబ్బాయి, వాకచర్ల కృష్ణ, ఉప్పాడ కోటరెడ్డి ఉన్నారు. -
మదినిండుగా భూమిపండుగ
ఏజన్సీలో అడవిబిడ్డల ఆనందహేల విల్లంబులతో పురుషులు వేటకు పయనం ఆటపాటలతో మహిళల నృత్యాలు చింతూరు (రంపచోడవరం): ఆదివాసీలకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన భూమిపండుగ వేడుక ఏజెన్సీ వ్యాప్తంగా కోలాహలంగా సాగుతోంది. తొలకరి ప్రారంభంలో మూడు రోజులపాటు ప్రతి పల్లెలో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి తమ భూముల్లో సిరులు పండాలని కోరుకుంటూ కులదేవతలతో పాటు విత్తనాలకు, భూమికి పూజ నిర్వహించడమే ఈ పండుగ ప్రాముఖ్యత. మూడు రోజులపాటు నిర్వహించే పండుగ వాతావరణం ముగియగానే అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. సంప్రదాయ వేట, ఆటాపాటా మూడు రోజులపాటు పురుషులంతా కలసి విల్లంబులు చేతబూని సంప్రదాయ వేట నిమిత్తం అడవిబాట పడతారు. ఇదే సమయంలో మహిళలు పండుగ నిర్వహణ కోసం గ్రామ సమీపంలోని రహదారుల వద్దకు చేరుకుని రేల నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, వచ్చీ, పోయే వాహనాలను ఆపుతూ డబ్బులు అడుగుతారు. కొన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రాలకు వచ్చి దుకాణాల వద్ద కూడా డబ్బులు అడుగుతారు. ఇలా మూడు రోజులపాటు వసూలైన డబ్బులతో పూజలకు కావల్సిన సామగ్రి కొనుగోలు చేసి పండుగ నిర్వహిస్తారు. ఇక ఉదయం వేటకు వెళ్లిన పరుషులు సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. వేటలో భాగంగా ఏదైనా జంతువును వేటాడితే దానిని గ్రామస్తులంతా సమానంగా పంచుకుంటారు. ఏ జంతువును వేటాడకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన పురుషులపై సంప్రదాయంలో భాగంగా మహిళలు పేడనీళ్లు జల్లి స్వాగతం పలుకుతారు. -
‘సోకులగూడెం’ వైఎస్సార్సీపీలో చేరిక
గిరిజనులకు అనంతబాబు సాదర ఆహ్వానం రంపచోడవరం : ‘టీడీపీ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. గ్రామంలో ఒక్క ఇల్లు ఇచ్చారు, మిగిలిన వారి పరిస్థితి ఏమిటీ? అంటూ సోకులగూడెంలోని మొత్తం గిరిజనులు దండుగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, పెద్దలు పార్టీలో చేరారు. పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై విశ్వాసంతో పార్టీలో చేరినట్టు వారు చెప్పారు. గిరిజన తెగల్లో తేడాలు చూపుతూ ఒక వర్గానికి పింఛను మంజూరు చేస్తున్నారని, గ్రామానికి కనీసం రోడ్డు కూడా లేదని వారు వాపోయారు. భవిష్యత్తులో సమస్యలు తీరాయతాయన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అనంతబాబు మాట్లాడుతూ గిరిజనులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇదే పరిస్థితి ఏజెన్సీలో అనేక గ్రామాల్లో ఉందన్నారు. గిరిజనుల సమస్యలు పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లతామన్నారు. సోకులగూడేనికి చెందిన వెంకటేశ్వర్లు, సండ్రు ప్రసాద్‌లుతో కలిసి సుమారు 150 మందికి పార్టీలో చేరారు. వీరికి అనంతబాబు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ మండల కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ పత్తిగుళ్ల భారతి, సర్పంచిల సమాఖ్య అ««ధ్యక్షుడు పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ కారుకోడి పూజ, పార్టీ యూత్ అధ్యక్షుడు రాపాక సుదీర్, మహిళ అధ్యక్షురాలు కాపారపు రూతూ, ప్రచార కమిటీ వీఎం కన్నబాబు, ఖాన్, జాఫర్, పరదా బాబురావుదొర, బొప్పా సత్యనారాయణ, విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
మూడే నెలలన్నారు 9 నెలలైంది
విలీన మండలాల్లో వైద్యం గగనం ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత మూడు నెలల్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమిస్తానన్న సీఎం తొమ్మిది నెలలైనా ఇప్పటికీ కాంట్రాక్ట్ వైద్యుడే దిక్కు సకాలంలో చికిత్స అందక ప్రాణాలు విడుస్తున్న గిరిజనులు చింతూరు ఏరియా ఆసుపత్రిగా పేరు మార్చారు.. సౌకర్యాలు మరిచారు హామీలకే పరిమితమైన డయాలసిస్ సెంటర్ రక్తనిధి కేంద్రం ఏర్పాటు బాబు గారి హామీలు ‘నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను...మూడు నెలల్లో ఏరియా ఆస్పత్రిని చింతూరులో మంజూరు చేస్తాను ... అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తాను... వైద్య నిపుణుల కొరత లేకుండా చూస్తాను ... రోగాలకు భయపడకండ’ం టూ ఏజెన్సీలో గత ఏడాది ఏప్రిల్‌లో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన భరోసా ఇది... కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 14 పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోగులకు నాణ్యమైన సేవలు అందడంలేదు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు లేకపోవడంతో అక్కడుండే నర్సులే రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అమలు ఇలా... చింతూరును ఏరియా ఆసుపత్రిగా మార్చారు... మరి వసతులు...సిబ్బంది.. వైద్య నిపుణులు మాట... అదీ చూద్దాం. ∙ఏరియా ఆసుపత్రిగా మార్చి ఆరు నెలలైనా నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, అనస్థీషియన్ వంటి ప్రత్యేక వైద్య నిపుణులను ఇంతవరకూ నియమించలేదు. స్టాఫ్ నర్సులనూ నియమించలేదు. ∙చింతూరు ఏరియా ఆసుపత్రిలో కనీసం ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం. ఏరియా ఆస్పత్రితోపాటు ఇతర మండలాల్లో ఉన్న పీహెచ్సీ, సీహెచ్సీలలో కూడా వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వర రామచంద్రాపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు జీడిగొప్ప పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులను డిప్యూటేష¯ŒSపై నియమించడంతో అక్కడ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైద్యులతోపాటు జీడిగొప్ప పీహెచ్సీలో ఇద్దరు స్టాఫ్ నర్సులు, కూటూరు పీహెచ్సీలో ఓ స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : విలీన మండలాల్లో వైద్య సేవలు గగనంగా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వల్ల నాలుగు విలీన మండలాల ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. అరకొరగా ఉన్న వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా విలీన మండలాల్లో పర్యటించారు. ఆ రోజు జరిగిన చింతూరులో బహిరంగ సభలో మాట్లాడుతూ చింతూరు ప్రాథమిక వైద్యశాలలో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో వైద్యులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రత్యేక చర్యల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు. సీఎం హామీ ఇచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఆ హామీకి దిక్కులేదు. విలీన మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వల్ల సకాలంలో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కోసం గిరిపుత్రులు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నా ఇతర రాష్ట్రం వారికి ఇక్కడ వైద్యం చేయబోమని తిప్పి పంపేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిగా మార్చారు.. సౌకర్యాలు మరిచారు... ఆగస్టు నెల నుంచి విలీన మండలాల్లో గిరిజనులు అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధి బారినపడి ప్రాణాలు వదులుతుందడడంతో ప్రభుత్వం హడావుడిగా చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పతిగా మార్చింది. పేరు మార్చారుగానీ ఇప్పటికీ ఏరియా ఆస్పత్రికి తగినట్లు వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయలేదు. నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, అనస్థీషియన్ వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్ నర్సులనూ నియమించలేదు. ఏరియా ఆస్పత్రిగా మార్చి ఆరు నెలలు కావస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం విలీన మండలాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం. ఏరియా ఆస్పత్రితోపాటు ఇతర మండలాల్లో ఉన్న పీహెచ్సీ, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో కూడా వైద్యలు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో రెగ్యులర్ వైద్యాధికారులను నియమించకపోవడంతో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వరరామచంద్రాపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు జీడికుప్ప పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులను డిప్యూటేష¯ŒSపై నియమించడంతో అక్కడ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైద్యులతోపాటు జీడిగుప్ప పీహెచ్సీలో రెండు స్టాఫ్ నర్సులు, కూటూరు పీహెచ్సీలో ఒక స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 14 పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోగులకు నాణ్యమైన సేవలు అందడంలేదు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు లేకపోవడంతో ఆయా ఆస్పత్రుల్లో ఉండే నర్సులు రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అత్యవసర సమయాల్లో కూడా నర్సులు, సిబ్బందే ప్రజలకు వైద్యం చేస్తుండడంతో విలీన మండలాల్లో వైద్య సేవలు ఏవిధంగా అందుతున్నాయో తెలియజేస్తోంది. డయాలిసిస్ కేంద్రమేదీ? విలీన మండలాల్లో గత ఆగస్టు నుంచి అంతుచిక్క ని కాళ్లవాపు వ్యాధితో 14 మంది మరణించారు. ఈ మరణాలకు ముత్రపిండాలు విఫలమవడం కూడా ఓ కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. సురక్షితమైన తాగునీరు అందక గిరిజనులు కొండకోనల్లో దొరికే నీటినే తాగుతున్నారు. ఫలితంగా ముత్రపిండాలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రభుత్వం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ముత్రపిండాల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఏజెన్సీలోని గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందక రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలో రక్తం చాలక ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా రంపచోడవరంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వహామీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. కొరత ఉంది.. డిప్యూటేష¯ŒSపై నియమించాం చింతూరు ఏరియా ఆస్పత్రికి నూతనంగా బిల్డింగ్ నిర్మింస్తున్నాం. ప్రస్తుతం పక్కనే ఉన్నత పాఠశాలలో ఆపరేష¯ŒS థియేటర్ ఏర్పాటు చేశాం. అక్కడ రెగ్యులర్ వైద్యులు లేరు. కాంట్రాక్ట్ పద్ధతిపై ఒక డాక్టరును నియమించాం. నలుగురు వైద్యులను డిప్యూటేష¯ŒSపై పంపాం. రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. కూనవరంలో ముగ్గురు వైద్యాధికారులు ఉన్నారు. – డాక్టర్ టి.రమేష్ కిశోర్, డీసీహెచ్ఎస్. వైద్య సేవలు మెరుగుపరచాలి చింతూరు పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. డాక్టర్లు కొరత ఉంది. సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే అన్ని పోస్టులను భర్తీ చేయాలి. వైద్యసేవలు మెరుగుపరచాలి. డయాలసిస్ సెంటర్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలి. – సోయం అరుణ, జెడ్పీటీసీ, చింతూరు. -
గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఏలేశ్వరం : గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యే క దృíష్టి సారించినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేష న్ ను గురువారం ఆయన ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నక్సల్ ప్రభావానికి లోనుకాకుండా గిరిజనుల అభివృద్ధి, ఉపాధిలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గిరిజన యువతకు పోలీస్శాఖలతోపా టు వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా క్రైం రేటు తగ్గిందన్నారు. నక్సల్ ప్రభావాన్ని తగ్గించామన్నారు. ఎంతటివారైనా అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పపడితే క్షమించేది లేదన్నారు. జిల్లాలో నల్లధనా న్ని దఫదఫాలుగా సుమారు రూ.26 లక్ష ల వరకూ స్వాధీనం చేసుకున్నామన్నా రు. తమశాఖలో సుమారు 400 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఎం పికలో పారదర్శకత పాటిస్తామన్నారు. ప్రత్తిపాడు సర్కిల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎస్సై వై. రవికుమార్, సిబ్బంది ఉన్నారు. -
నోట్ల కోసం నోళ్లొక్కటై..
బ్యాంకుల వద్ద గిరిజనుల నిరసన పెద్ద నోట్ల రద్దు పెద్దవారికేమో కానీ చిన్నవారికి పెద్ద కష్టాలు తెచ్చిపెడుతోంది. రద్దు అయిన నోట్ల మార్పిడికి వెళ్తుంటే అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.. విసుక్కుంటున్నారు.. బయటకు పొమ్మంటున్నారు. ఈ చర్యలను వారినుంచి ఊహించని ప్రజలు వారి నిరసనను వివిధ రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు రాస్తారోకో చేస్తే మరొకరు ధర్నా చేస్తున్నారు. ఒకరు బ్యాంకులను ముట్టడిస్తే మరొకరు ప్రజా సంఘాల సహకారంతో నిరసనప్రదర్శనలు చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మిడివరం : రద్దయిన రూ.500, వెయ్యి నోట్లను డిసెంబర్ 30 వరకు కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ, ఏఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మిడివరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బళ్ల గేటు సెంటర్ నుంచి స్టేట్‌బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించి బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. రదై్దన నోట్లను డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించాలని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయం వల్ల సామాన్యులు, కార్మికులు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పనులు మానుకుని బ్యాంకులు వద్ద పడి గాపులు పడుతున్నార న్నారు. రూ.2వేల నోటు వల్ల సామాన్యలకు ప్రయోజనం లేదన్నారు. నోట్ల మార్పిడి వల్ల చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ, ఏఐటీయూ నాయకులు జి.దుర్గాప్రసాద్, వనచర్ల వెంకట్రావు, బీ.మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. నగదు లేదు పొమ్మన్నారు మోతుగూడెం : మోతుగూడెం ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులకు అధికారులు రిక్త హస్తాలు చూపతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి శుక్రవారం బ్యాంకుకు వచ్చిన వారికి ఉదయం 11 గంట ల వరకు రూ.వెయ్యి ఇచ్చి, ఆ తర్వాత నగదు లేదు పొమ్మనారు. దీంతో ఖాతాదారులు అన్ని బ్యాంకుల్లో ఖాతాదారులు అడిగినంత నగదు ఇస్తుంటే ఈ బ్యాంకుకు ఏప్పుడూ వచ్చిన నగదు నిల్వలు లేవనే చెప్పుతున్నారు. అలాంటప్పుడు బ్యాంకును తెరవడం ఎందు కు? మూసేయాలని ఖాతాదారులు శుక్రవారం బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ బ్యాంకు అధికారులు నగదు నిల్వలు సరిపడే విధంగా తేకుండా, తక్కువ నగదు తెచ్చి వారం రోజులుపాటు సర్దుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఇకనుంచైన అధికారులు ఖాతాదారులకు ప్రభుత్వ ఆదేశించిన మేర నగదు చెల్లింపులు చేయాలని వారు కోరుతున్నారు. -
ఆగని కాళ్లవాపు మరణాలు
చర్యలు చేపట్టని అధికారులు తాజాగా మరో ఇద్దరు మృతి రంపచోడవరం: కాళ్లవాపు వ్యాధితో మరణిస్తున్న గిరిజనుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. శనివారం విలీన మండలంలో మరో ఇద్దరు ఆదివాసీలు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరుకుంది. రెండు నెలలు కాలంలో 12 మంది ప్రాణాలు కోల్పోయినా అధికారుల్లో ఇంకా కదలిక రాలేదు. వ్యాధి కి కారణాలు, నివారణ చర్యలు, చికిత్స ఏమిటనే అంశాలను వైద్య, ఆరోగ్య శాఖ పట్టించుకోవడం లేదు. తాజా గా చింతూరు మండలం పాలగూడెం గ్రామానికి చెంది న పొడియం మల్లమ్మ (45) శుక్రవారం, మామిళ్లగూడెంకి చెందిన మచ్చిక లక్ష్మయ్య(55) శనివారం ఇంటి వద్ద కాళ్లవాపు వ్యాధితో మృత్యువాత పడ్డారు. కాళ్లవాపు మరణాలు సంభవించిన తరువాత ప్రతీ గ్రామంలో ఇంటింటి సర్వే చేసి వ్యాధి పీడితులను గుర్తించాలనే అధికారులు నిర్ణయించారు. అయితే ఈ సర్వే ద్వారా అధికార యంత్రాంగం చేసింది శూన్యమానే చెప్పాలి. ఇప్పటి వరకు వీఆర్ పురం మండలంలో 8 మంది, కూనవరం మండలంలో ఒక్కరు, చింతూరులో ముగ్గురు కాళ్లవాపుతో మృతి చెందారు. జాతీయ స్ధాయి వైద్య బృందం విలీన మండలంలో పర్యటించి వ్యాధి నిర్ధారణ కారణాలు వెల్లడిస్తారని ప్రకటించినప్పటికీ నేటికీ ఎటువంటి ప్రకటనా లేదు. హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించలేదు. ప్రత్యేక వైద్యులను నియమించాలి చింతూరులో ఏర్పాటు చేసిన ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను నియమించాల్సిన అవసరం ఉంది. వారుంటే బాధితులకు సత్వరంగా వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది. కొంత మంది వైద్యులు కాళ్లవాపు కిడ్ని సమస్య వలనే వస్తుందని చెబుతున్నారు. అయితే కాకినాడ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకున్న వారు తిరిగి మరొమారు డయాలసిస్ చేయించుకోవాలంటే చింతూరు ఆసుపత్రిలో డయాలసిస్ యూని ట్ లేదు. కనీసం స్వేచ్ఛమైన తాగునీరు అందించేందుకు కూడా చర్యలు తీసుకోలేదు. ఎంత మంది ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయాకా అధికారులు మేల్కొంటారో చూడాలి. -
ఆగని మృత్యు కేక
కాళ్లవాపు వ్యాధితో మరొకరు మృతి చికిత్సపై అశ్రద్ధతోనే...పదకొండుకు చేరిన మరణాల సంఖ్య కాళ్లవాపు ... వ్యాధి ఏమిటో తెలియదు. – ఎందుకు వస్తుందో నిర్ధారణ కావడం లేదు. తమ పనులు తాము చేసకుంటూనే హఠాత్ మరణాలు. చోటుచేసుకోవడంతో ఆ కుంటుబాల్లో విషాదం. మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లినా నిలవని ప్రాణాలు. దీంతో మెరుగైన చికిత్సకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించినా నిరాకరిస్తున్న రోగులు. దీంతో చావును చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. వరుస మరణాల సంఖ్య పదకొండుకు చేరుకుంది. వీఆర్‌పురం : వీఆర్‌పురం మండలంలో వెలుగుచూసిన కాళ్లవాపు వ్యాధి చింతూరు, కూనవరం మండలాలకు విస్తరించి మరణ మృదంగాల విషాద ధ్వనులు వినిపిస్తునేఆగని మృత్యుకేక ఉన్నాయి. వ్యాధి నివారణ మాట దేవుడెరుగు ... కనీసం ఎందుకు వస్తుందో ... ఏ విధంగా సోకుతుందో ... మరణాలకు కారణాలేమిటో ... ఏ వైద్య చికిత్సలు అందించాలనే విషయాలపై వైద్యుల్లోనే గందరగోళం నెలకుంది. వంటసారా తాగడం వల్లనే మరణిస్తున్నారని జిల్లా అధికారులు ఓ దశలో ప్రకటించడంతో పెద్ద దుమారమే చెలరేగింది, పసి పిల్లలు దగ్గర నుంచి విద్యార్థుల వరకూ మృత్యువాత పడుతున్నారని, వారు కూడా కాపుసారా తాగే చనిపోతున్నారా అని విమర్శలు వచ్చాయి. కాకినాడలోని జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లినా వ్యాధి కోరల్లోనుంచి బయటపడలేక అసువులుబాయడంతో ఈ వ్యాధి ఉన్నవారు కూడా దూరంగా ఉంటున్నారు. వీఆర్‌పురం మండలంలోని చినమట్టపల్లి గ్రామానికి చెందిన సోడె కిష్టయ్య(45)కూడా గత నెలలో ఈ వ్యాధి ప్రభావానికి గురై భద్రాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. చికిత్సకు సహకరించి ఉంటే బతికి ఉండేవాడు.. చినమట్టపల్లి గ్రామంలో గత నెల 21వ తేదీన వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింట సర్వేలో సోడె కృష్ణయ్యకు కాళ్లవాపు లక్షణాలున్నట్లు సిబ్బంది గుర్తించారు. అతడిని చికిత్స కోసం కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పట్లు చేసినప్పటికీ అతడు మాత్రం భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. రెండు రోజుల అనంతరం అతడికి కాళ్లవాపు తగ్గిపోవండతో యథావిథిగా వ్యవసాయ పనులకు వెళ్లాడు. శనివారం ఉదయం గ్రామంలోని ఉపాధి పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడి భార్య లాలమ్మ , కుమారై శశిరేఖలు ఆటోలో రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, ఏరియా ఆస్పత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. అప్పుడే అందరితోపాటుగా కాకినాడ వెళ్లి చికిత్స చేయించుకుని ఉంటే తన భర్త బతికేవాడని కిష్టయ్య భార్య లాలమ్మ బోరున విలపిస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగానే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి మూలంగానే కిష్టయ్య మృతి చెందాడు. అతడిని శనివారం సాయంత్రం రేఖపల్లి పీహెచ్‌సీకి తీసుకు వచ్చారు.అప్పటికే అతడి పరిస్థితి విషంగా ఉంది. డ్యూటీ డాక్టర్ పరీక్షించి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. గత నెలలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో కిష్టయ్యకు కూడా కాళ్లవాపు లక్షణాలు న్నట్లు గుర్తించి, అతడిని చికిత్సకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినా సహకరించలేదు. వ్యాధి ప్రభావానికి గురై కాకినాడ ఆస్పత్రికి వెళ్లి› చికిత్స చేయించుకు వచ్చిన వారందరూ ఆరోగ్యంగా ఉన్నారు. – ఎ.రామారావు, సీనియర్‌సివిల్ సర్జన్, కూనవరం సీహెచ్‌సీ -
గిరిజనుల ఆర్థిక ప్రగతికి చర్యలు
పోషకాహారం లోపంతోనే వ్యాధులు l సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ రంపచోడవరం : ఏజెన్సీలో ప్రతీ గిరిజన కుటుంబానికి నెలకు రూ. 3 వేల ఆదాయం వచ్చేట్లు, ప్రతీ గ్రామంలో జాబ్‌కార్డు ద్వారా నెలకు 15 రోజుల పనిదినాలు కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వీఆర్ పురం మండలంలో ప్రబలిన వ్యాధులపై నిపుణులైన రెండు వైద్య బృందాలు గిరిజనుల ఆరోగ్య స్థితిగతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారని తెలిపారు. పోషకారలోపాలతోనే వ్యాధుల బారిన పడుతున్నట్లు వారు నిర్ధారించారనానరు. గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా వారిలో కొనుగోలు శక్తిని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా రెండవ స్ధానంలో ఉందని మొదటి స్థానానికి తీసుకురావడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఉద్యానవనసాగులో జిల్లా మొదటి స్ధానంలో ఉందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల ఆవశ్యకతను తెలుపుతూ 2018 నాటికి జిల్లాను బహిరంగ మలవిసర్జణ రహిత జిల్లాగా ప్రకటించేందుకు అందరూ సమన్వయంతో పాటుపడాలని సూచించారు. యుకలిప్టస్ సాగును పూర్తిగా అధికారులు సమన్వయంతో అరికట్టి భూసారాన్ని, భూగర్భజాలాలను సంరక్షించాలని సూచించారు. అటవీహక్కుల ద్వారా పట్టాలు పొందిన గిరిజన రైతులను ఆ భూములును అభివృద్ధి చేసుకునేందుకు అటవీ అధికారులు అభ్యంతరాలు తెలుపుతున్నారని క్షేత్రస్థాయి సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నవంబరులో మరో దఫా సమీక్ష నిర్వహిస్తామని అప్పటికీ పనితీరుమెరుగుపడకపోతే సంబంధిత సిబ్బందిని విధులు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడుతూ పలు అంశాల్లో ఆశించిన స్థాయిలో సిబ్బంది పనితీరు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, డ్వామా పీడీ ఎ. నాగేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ప్రవీణ్, పీఆర్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ పీకే నాగేశ్వరరావు డీఈ శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణా లేదూ..ముందు చూపూ లేదు
అమలుకాని వైద్య ప్రణాళికలు భర్తీ కాని పోస్టులు నిలిచిపోయిన దోమతెరల పంపిణీ ఇదీ ఏజెన్సీలో వైద్య సేవల పరిస్ధితి రంపచోడవరం : ఏజెన్సీలో మలేరియా, విషజ్వరాలతో గిరిజనులు ప్రాణాలు కోల్పోయినపుడు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హడావుడి చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా సాధారణ పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యసేవలు సక్రమంగా అందుతున్నదీ, లేనిదీ లోతుగా అధ్యయనం చేయడం లేదు. క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించే అధికారులు ఏజెన్సీలో కానరావడం లేదు. ఏటా సీజనల్‌గా వచ్చే వ్యాధులపై సమగ్ర ప్రణాళిను కూడా అమలు చేయడం లేదు. ఫలితంగా మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటింటి పరిశీలన జరగడం లేదు ఏజెన్సీ 11 మండలాల్లో 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు( పీహెచ్సీ) ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఆరు సబ్‌సెంటర్లు ఉంటాయి. ప్రతి సబ్ సెంటరుకు ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక పురుష ఆరోగ్య కార్యకర్తా ఉంటారు. వీరి పనిని పరిశీలించేందుకు మగ, ఆడ పర్యవేక్షకులు ఉండాలి. ఇంత పెద్ద వైద్య వ్యవస్థ ఉన్నప్పటికీ, మారుమూల గ్రామాల్లో ప్రబలుతున్న వ్యాధుల గురించి బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఏఎన్ఎంలు సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటిని సందర్శించి ఆరోగ్య విషయాలు, రక్త నమూనాలు సేకరించాలి. వ్యాధులు ఎక్కువగా నమోదైతే పీహెచ్‌సీకి సమాచారం ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన పర్యవేక్షకులు స్థానికంగా నివాసం ఉండడం లేదు. దూర ప్రాంతాల్లో ఉంటూ విధులకు హాజరు కావడం వల్ల వారు పూర్తిస్థాయిలో గ్రామాలను సందర్శించడం లేదు. కేవలం అంగన్వాడీ కేంద్రాల సందర్శనకే పరిమితం అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్త ఉంటారు. ఆ గ్రామ బాధ్యత ఆశాలపై నెట్టివేస్తున్నారు. వారికి కనీసం గౌరవ వేతనం కూడా సక్రమంగా చెల్లించడం లేదు. వేధిస్తున్న వైద్యుల కొరత ఏజెన్సీ 11 మండలాల్లోని పీహెచ్‌సీల్లో 57 మంది వైద్యులు పనిచేయాలి. సుమారు 10 వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక డాక్టర్‌కు రెండు పీహెచ్‌సీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఫలితంగా రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందడం లేదు. వివిధ స్థాయిలో స్టాఫ్ నర్సులు, ఎంపీఎంఓలు, ఫార్మాసిస్టులు, ఎంపీహెచ్ఏ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. విలీన మండలాల్లో వివిధ పోస్టుల్లో 221 మంది సిబ్బంది పనిచేయాలి. వాటిలో 79 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీహెచ్‌సీలకు ఈ–ఔషదం ద్వారా ఆన్లైన్లో మందులు సరఫరా చేస్తున్నారు. అయితే ఏజెన్సీలోని చాలా పీహెచ్‌సీలకు నెట్ సదుపాయం లేదు. మందుల ఇండెంట్ పెట్టేందుకు ఫార్మాసిస్టులు లేరు. నెల్ సౌకర్యం ఉండి ఇండెంట్ పెట్టినా సెంట్రల్æడ్రగ్ స్టోర్ నుంచి రెండు నెలలకు గాని మందులు రావడం లేదు. మూడేళ్లుగా దోమతెరలు రాలేదు ఏజెన్సీలో మూడేళ్లుగా దోమతెరల పంపిణీ జరగడం లేదు. 2012లో లక్షా 60 వేల దోమతెరలు పంపిణీ చేశారు. తరువాత వాటి అవసరం ఉన్న సరఫరా మాత్రం జరగలేదు. 2014, 2015 సంవత్సరాల్లో దోమతెరల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకపోయింది. దోమతెరల పంపిణీతో పాటు వాటి వినియోగంపై అవగాహన కలిగించడం కూడా ఎంతో అవసరం.ఈ ఏడాది దోమతెరల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటì æవరకూ రాలేదు. జిల్లా మలేరియా కార్యాలయం అధికారులు ఫ్యామిలీ, డబుల్, సింగిల్ సైజ్ అనే మూడు రకాల దోమతెరల కోసం ప్రతిపాదనలు పంపించారు. మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలతో పాటు ఏజెన్సీ అంతటా పంపిణీ చేసేందుకు 3 లక్షల 60 వేల దోమతెరలకు ప్రతిపాదనలు పంపించారు. ఏజెన్సీలో మలేరియా విభృజిస్తునప్పటికీ దోమతెరలు మాత్రం రాలేదు. మలేరియా సీజన్లోనే దోమతెరలను పంపిణీ చేయడం వల్ల ఫలితం ఉంటుంది. -
గిరిజన వలసల నివారణలో ప్రభుత్వం విఫలం
ఎమ్మెల్యే రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ నేతల అనంతబాబు జడేరు (గంగవరం ) : ఏజెన్సీ నుంచి ఉపాధి కోసం వలస వెళుతున్న గిరిజన కూలీలు ఎక్కువగా చనిపోతున్నారని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ యుజవజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) డిమాండ్ చేశారు. గంగవరం మండలం జడేరుకు చెందిన అల్లం శివశంకర్ రెడ్డి (25) ఉపాధి కోసం కోయంబత్తూర్ వెళ్లి గత నెలలో ఆకస్మికంగా మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని రాజేశ్వరి, అనంత బాబు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారుlమాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల నుంచి వలసలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో సరైన పనులు లేక గిరిజన కుటుంబాలు వలసలు పోయి, ఇతర ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.పలువురు వైఎస్సార్సీపీ నాయకులు వారి వెంట ఉన్నారు. -
ఏజెన్సీలో ఆగని మృత్యుఘోష
-
ఏజెన్సీలో ఆగని మృత్యుఘోష
కాళ్లవాపుతో మరో గిరిజన మహిళ మృతి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం ఏడుకు చేరిన మృతుల సంఖ్య భయంతో గిరిజనం ఊరటనివ్వని యంత్రాంగం చర్యలు చింతూరు : ఏజన్సీలో మృత్యుఘోష ఆగడం లేదు. విలీన మండలాలను పట్టి పీడిస్తున్న కాళ్లవాపు వ్యాధితో వీఆర్‌పురం మండలంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా తాజాగా చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన బందం సుబ్బమ్మ (60) అనే గిరిజన మహిళ కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. బొడ్రాయిగూడెంకు చెందిన సుబ్బమ్మ వారం రోజులక్రితం చట్టిలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా జ్వరం రావడంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు జ్వరంతోపాటు రక్తహీనత, కాళ్లవాపు లక్షణాలు కనిపించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటినుంచి కాకినాడలో చికిత్స పొందుతున్న సుబ్బమ్మ పరిస్థితి శుక్రవారం ఒక్కసారిగా విషమించడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దాసుపత్రికి వెళ్లినా... కాళ్లవాపు వ్యాధి మూలాలను ఇంతవరకూ వైద్యులు గుర్తించకపోవడంతో రోగుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాళ్లవాపును నివారించేందుకు అధికారులు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించి మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లాకు పెద్ద దిక్కయిన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పెద్దాసుపత్రికి వెళుతున్నాం ... నయమవుతుందని ఆశపడిన బాధితులకు నిరాశే ఎదురవుతోంది. పెద్దాసుపత్రిలో సైతం చికిత్స పొందుతూ తమవారు మృత్యువాత పడడం వారి కుటుంబసభ్యులను కుంగదీస్తోంది. వీఆర్‌పురం మండలం చిన్నమట్టపల్లికి చెందిన కారం రామారావు, తమ్మయ్యపేటకు చెందిన ముసురు వెంకటస్వామిలు కాకినాడ ఆసుపత్రిలో రెండ్రోజులపాటు చికిత్స పొందిన అనంతరం మృతిచెందగా తాజాగా చింతూరు మండలం బొడ్రాయిగూడెంకు చెందిన సుబ్బమ్మ ఆరు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం మృతిచెందింది. మరోవైపు కాకినాడ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వ్యాధి తగ్గిందని స్వస్థలాలకు పంపిన వారికి తిరిగి వ్యాధి తిరగబెడుతుండడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలం మామిళ్లగూడెంకు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురవగా మరోమారు కాకినాడ తరలించి వ్యైదం అందిస్తున్నారు. కాళ్లవాపు వ్యాధి అదుపులోకి రాకపోవడంతో విలీన మండలాలకు చెందిన ప్రజల్లో ఆందోళన నెలకొంది. రానురాను మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని, వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు వేడుకుంటున్నారు. -
ఎంతకాలం దగా!?
ఊరికో తరహా ప్యాకేజీతో మభ్యపెడుతున్న ప్రభుత్వం స్పష్టత ఇవ్వని అధికార యంత్రాంగం ఆందోళనలతో హోరెత్తుతున్న ముంపు మండలాలు లక్షలాది ఎకరాలకు సాగు నీరందించనున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు అది. అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తూ.. సర్వం కోల్పోతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తోందని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఊరికో రకంగా పరిహారాన్ని ప్రకటిస్తూ.. గందరగోళం సృష్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కూనవరం రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని అదే పనిగా చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు.. నిర్వాసితుల పరిహారంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం పునరావాసం, పునర్నిర్మాణ విషయాల్లో ప్రభుత్వం వద్ద స్పష్టత లేదని, చివరకు ప్యాకేజీ ఇవ్వకుండానే వెళ్లగొట్టినా ఆశ్చర్యమేమీ లేదని అఖిలపక్షం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలతో ముంపు మండలాలు హోరెత్తుతున్నాయి. అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు జెండాలు పక్కనపెట్టి, నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ కోసం ఉద్యమ బాట పట్టాయి. కూనవరం, వీఆర్ పురం, నెల్లిపాక, చింతూరు మండలాల్లో నిత్యం పోరుబాటలు కొనసాగుతున్నాయి. సేకరించిన భూమి 50 శాతానికి పైనే.. ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం, నిర్వాసితులకు పునరావాసం కింద సేకరించిన భూమి 50 శాతంపై చిలుకు ఉంది. 63 పంచాయతీలు కలిగిన నాలుగు విలీన మండలాల్లో 189 రెవెన్యూ గ్రామాలు, 329 హ్యాబిటేషన్లు ఉన్నాయి. 2008, 2010 లో రెండు దఫాలుగా రైతులకు ఇచ్చిన భూనష్ట పరిహారం సుమారుగా రూ.370 కోట్లు ఉంటుంది. 12 ఏళ్లలో పూర్తిస్థాయి భూసేకరణ చేపట్టని ప్రభుత్వం రెండేళ్లలో అన్నీ చేస్తోందన్న నమ్మకం లేదని నిర్వాసితులు చెబుతున్నారు. స్పష్టత ఇవ్వని అధికారులు పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని చెబుతున్న ప్రభుత్వం పనులను కూడా ఆ మేరకు వేగవంతం చేసింది. భారీ యంత్రాలు తెచ్చి, ముమ్మరంగా పనులు చేపట్టింది. పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా, ఊరికో ప్యాకేజీ ప్రకటిస్తూ నిర్వాసితులను ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పే మెరుగైన ప్యాకేజీ ఎలా ఉంటుందో స్పష్టం చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాసం ఎక్కడ కల్పిస్తున్నారో, ఎన్ని ఎకరాల భూమి సేకరించారో స్పష్టం చేయాలంటున్నారు. ప్రతి కుటుంబానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఎంత, 18 ఏళ్లు నిండిన యువతకు, వ్యాపారులకు, చేతివృత్తుల వారికి ఇచ్చే ప్యాకేజీని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూ నష్టపరిహారంలో పట్టిసీమ, పోలవరం కుడికాలువ, కుక్కునూరు మండలాల్లో వెల్లడించిన ప్యాకేజీని కూనవరం, వీఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోనూ ప్రకటించాలని పట్టుబడుతున్నారు. ముంపు కింద ఉన్న రైతుల భూములు 51,189 ఎకరాలు రైతుల నుంచి సేకరించినది 32,683 ఎకరాలు ఇంకా సేకరించాల్సినది 18,506 ఎకరాలు కొత్తగా భూమిని నోటిఫై చేయాల్సిన గ్రామాలు 66 కొత్తగా 66 గ్రామాలు నోటిఫై నాలుగు మండలాల్లో వివిధ కారణాలతో నోట్‌ఫై చేయని గ్రామాలు 66 వరకున్నాయి. వాటిని ఇప్పుడు నోట్‌ఫై చేస్తున్నాం. మొత్తం కలిపి మరో 12 వేల ఎకరాలు అదనంగా పెరిగే అవకాశం ఉంది. వాటిని సర్వే చేసి, నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. పరిహారం ఎంత అనేది ప్రభుత్వ ఉత్తర్వులను బట్టి ఉంటుంది. – ఎల్లారమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) -
మంత్రి వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు
నెల్లిపాక: గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు వాహనాన్ని ఎటపాక మండలం నెల్లిపాక జాతీయరహదారిపై పోలవరం నిర్వాసితులు అడ్డుకున్నారు. విలీన మండలాల పర్యటనకు వచ్చిన మంత్రి కూనవరం మీదుగా భద్రాచలం వస్తున్నారనే సమాచారంతో నెల్లిపాకలో అఖిలపక్షం ఆద్వర్యంలో 28 రోజులుగా దీక్షలు చేస్తున్న నిర్వాసితులు బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకొని రహదారిపై అడ్డంగా నిలిచి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. అటుగా వచ్చిన మంత్రి కారును ఆపివేయటంతో ఆయన కారు నుంచి బయటకు దిగి దీక్షలు చేస్తున్న వారి వద్దకు వచ్చారు. వారి సమస్యలను విని వినతి పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంత్రి రావెల మాట్లాడుతూ ఏడు విలీన మండలాల ప్రజలకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. నిర్వాసితుల త్యాగాలతోనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, అయితే ముంపు ప్రాంత ప్రజలకు మెరుగైన ప్యాకేజీ, పునరావాసం కల్పించటంలో ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్వాసితుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానని, వాటిని తప్పకుండా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ‘ప్రభుత్వం మీద నమ్మకముంచి దీక్షలు విరమించండి. మీకు న్యాయం జరిగేలా సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటారు’ అని అన్నారు. మంత్రి హామీతో నిర్వాసితులు సంతృప్తి చెందారు. దాంతో దీక్షలో ఉన్నవారికి మంత్రి రావెల నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. నాయకులు కందుకూరి మంగరాజు, కొమరం ఫణీశ్వరమ్మ, కృష్ణబాబు, నలజాల శ్రీను, కరి శ్రీను, రాఘవయ్య, గంగుల నర్సింహారావు, గంజి వెంకటేశ్వర్లు, సత్యానందం తదితరులున్నారు. -
జీవన సౌందర్యం
-
జీవన సౌందర్యం