- విలీన మండలాల్లో వైద్యం గగనం
- ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత
- మూడు నెలల్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమిస్తానన్న సీఎం
- తొమ్మిది నెలలైనా ఇప్పటికీ కాంట్రాక్ట్ వైద్యుడే దిక్కు
- సకాలంలో చికిత్స అందక ప్రాణాలు విడుస్తున్న గిరిజనులు
- చింతూరు ఏరియా ఆసుపత్రిగా పేరు మార్చారు.. సౌకర్యాలు మరిచారు
- హామీలకే పరిమితమైన డయాలసిస్ సెంటర్
- రక్తనిధి కేంద్రం ఏర్పాటు
మూడే నెలలన్నారు 9 నెలలైంది
Published Tue, Jan 31 2017 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 9:29 PM
బాబు గారి హామీలు
‘నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను...మూడు నెలల్లో ఏరియా ఆస్పత్రిని చింతూరులో మంజూరు చేస్తాను ... అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తాను... వైద్య నిపుణుల కొరత లేకుండా చూస్తాను ... రోగాలకు భయపడకండ’ం టూ ఏజెన్సీలో గత ఏడాది ఏప్రిల్‌లో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన భరోసా ఇది...
కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 14 పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోగులకు నాణ్యమైన సేవలు అందడంలేదు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు లేకపోవడంతో అక్కడుండే నర్సులే రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
అమలు ఇలా...
చింతూరును ఏరియా ఆసుపత్రిగా మార్చారు... మరి వసతులు...సిబ్బంది.. వైద్య నిపుణులు మాట... అదీ చూద్దాం.
∙ఏరియా ఆసుపత్రిగా మార్చి ఆరు నెలలైనా నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్,
గైనకాలజిస్ట్, అనస్థీషియన్ వంటి ప్రత్యేక వైద్య నిపుణులను ఇంతవరకూ నియమించలేదు. స్టాఫ్ నర్సులనూ
నియమించలేదు.
∙చింతూరు ఏరియా ఆసుపత్రిలో కనీసం ఒక్కరు
కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం.
ఏరియా ఆస్పత్రితోపాటు ఇతర మండలాల్లో ఉన్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో కూడా వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వర రామచంద్రాపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు జీడిగొప్ప పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులను డిప్యూటేష¯ŒSపై నియమించడంతో అక్కడ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది.
వైద్యులతోపాటు జీడిగొప్ప
పీహెచ్‌సీలో ఇద్దరు స్టాఫ్ నర్సులు, కూటూరు పీహెచ్‌సీలో ఓ స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సాక్షి, రాజమహేంద్రవరం :
విలీన మండలాల్లో వైద్య సేవలు గగనంగా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత వల్ల నాలుగు విలీన మండలాల ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. అరకొరగా ఉన్న వైద్యులు, సిబ్బంది ఆస్పత్రులకు వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా విలీన మండలాల్లో పర్యటించారు. ఆ రోజు జరిగిన చింతూరులో బహిరంగ సభలో మాట్లాడుతూ చింతూరు ప్రాథమిక వైద్యశాలలో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో వైద్యులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు ప్రత్యేక చర్యల ద్వారా గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని ప్రకటించారు. సీఎం హామీ ఇచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇప్పటి వరకూ ఆ హామీకి దిక్కులేదు. విలీన మండలాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వల్ల సకాలంలో వైద్యం అందక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం కోసం గిరిపుత్రులు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నా ఇతర రాష్ట్రం వారికి ఇక్కడ వైద్యం చేయబోమని తిప్పి పంపేస్తున్నారు.
ఏరియా ఆస్పత్రిగా మార్చారు.. సౌకర్యాలు మరిచారు...
ఆగస్టు నెల నుంచి విలీన మండలాల్లో గిరిజనులు అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధి బారినపడి ప్రాణాలు వదులుతుందడడంతో ప్రభుత్వం హడావుడిగా చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పతిగా మార్చింది. పేరు మార్చారుగానీ ఇప్పటికీ ఏరియా ఆస్పత్రికి తగినట్లు వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయలేదు. నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, అనస్థీషియన్ వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్ నర్సులనూ నియమించలేదు. ఏరియా ఆస్పత్రిగా మార్చి ఆరు నెలలు కావస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం విలీన మండలాల ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేకపోవడం గమనార్హం. ఏరియా ఆస్పత్రితోపాటు ఇతర మండలాల్లో ఉన్న పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో కూడా వైద్యలు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీహెచ్‌సీల్లో రెగ్యులర్ వైద్యాధికారులను నియమించకపోవడంతో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వరరామచంద్రాపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఆస్పత్రులకు జీడికుప్ప పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులను డిప్యూటేష¯ŒSపై నియమించడంతో అక్కడ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైద్యులతోపాటు జీడిగుప్ప పీహెచ్‌సీలో రెండు స్టాఫ్ నర్సులు, కూటూరు పీహెచ్‌సీలో ఒక స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 14 పోస్టులను భర్తీ చేయకపోవడంతో రోగులకు నాణ్యమైన సేవలు అందడంలేదు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, వైద్యులు లేకపోవడంతో ఆయా ఆస్పత్రుల్లో ఉండే నర్సులు రోగులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అత్యవసర సమయాల్లో కూడా నర్సులు, సిబ్బందే ప్రజలకు వైద్యం చేస్తుండడంతో విలీన మండలాల్లో వైద్య సేవలు ఏవిధంగా అందుతున్నాయో తెలియజేస్తోంది.
డయాలిసిస్ కేంద్రమేదీ?
విలీన మండలాల్లో గత ఆగస్టు నుంచి అంతుచిక్క ని కాళ్లవాపు వ్యాధితో 14 మంది మరణించారు. ఈ మరణాలకు ముత్రపిండాలు విఫలమవడం కూడా ఓ కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు. సురక్షితమైన తాగునీరు అందక గిరిజనులు కొండకోనల్లో దొరికే నీటినే తాగుతున్నారు. ఫలితంగా ముత్రపిండాలు దెబ్బతింటున్నాయి. దీంతో ప్రభుత్వం చింతూరు ఏరియా ఆస్పత్రిలో ముత్రపిండాల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఏజెన్సీలోని గర్భిణులకు సరైన పౌష్టికాహారం అందక రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలో రక్తం చాలక ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. దీనికి పరిష్కారంగా రంపచోడవరంలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వహామీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి.
కొరత ఉంది.. డిప్యూటేష¯ŒSపై నియమించాం
చింతూరు ఏరియా ఆస్పత్రికి నూతనంగా బిల్డింగ్ నిర్మింస్తున్నాం. ప్రస్తుతం పక్కనే ఉన్నత పాఠశాలలో ఆపరేష¯ŒS థియేటర్ ఏర్పాటు చేశాం. అక్కడ రెగ్యులర్ వైద్యులు లేరు. కాంట్రాక్ట్ పద్ధతిపై ఒక డాక్టరును నియమించాం. నలుగురు వైద్యులను డిప్యూటేష¯ŒSపై పంపాం. రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. కూనవరంలో ముగ్గురు వైద్యాధికారులు ఉన్నారు.
– డాక్టర్ టి.రమేష్ కిశోర్, డీసీహెచ్‌ఎస్.
వైద్య సేవలు మెరుగుపరచాలి
చింతూరు పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. డాక్టర్లు కొరత ఉంది. సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే అన్ని పోస్టులను భర్తీ చేయాలి. వైద్యసేవలు మెరుగుపరచాలి. డయాలసిస్ సెంటర్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలి.
– సోయం అరుణ, జెడ్పీటీసీ, చింతూరు.
Advertisement
Advertisement