government fail
-
ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే మరణాలు
ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): జ్వరాలతో మనుషులు చనిపోతున్నారంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి అన్నారు. వీరవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులు మరణించి తల్లి వెంకటలక్ష్మి చికిత్స పొందుతున్న సంఘటనకు సంబంధించి సాయి ఆసుపత్రిలో బాధితురాలిని ఆమె శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 మండలాల్లోను జ్వర పీడుతులతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. రోజురోజుకీ మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని మరణాలను చూడాల్సి వస్తుందన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 40 మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యపోస్టుటలు భర్తీలేక వైద్యుల కొరత ఏర్పడిందన్నారు. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని వచ్చి ఏమి చేశారని, కనీసం బాధితులను పరామర్శించలేదన్నారు. వైఎస్సార్సీపీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని, జ్వరాలతో జనం బాధపడుతున్నా ముఖ్యమంత్రి చలించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ మోహన్ రెడ్డి, మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్, నీలం గణపతి, కుక్క తాతబ్బాయి, వాకచర్ల కృష్ణ, ఉప్పాడ కోటరెడ్డి ఉన్నారు. -
అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం
అనంతపురం న్యూటౌన్ : ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సంగటి మనోహర్ అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రవియాదవ్‌తో కలసి స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించేందుకు మహాజనరాజ్యం పార్టీ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి«గా ఉన్న మల్లికార్జునకు మద్దతునిస్తున్నామన్నారు. -
గిరిజన వలసల నివారణలో ప్రభుత్వం విఫలం
ఎమ్మెల్యే రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ నేతల అనంతబాబు జడేరు (గంగవరం ) : ఏజెన్సీ నుంచి ఉపాధి కోసం వలస వెళుతున్న గిరిజన కూలీలు ఎక్కువగా చనిపోతున్నారని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైఎస్సార్ సీపీ యుజవజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) డిమాండ్ చేశారు. గంగవరం మండలం జడేరుకు చెందిన అల్లం శివశంకర్ రెడ్డి (25) ఉపాధి కోసం కోయంబత్తూర్ వెళ్లి గత నెలలో ఆకస్మికంగా మృతి చెందాడు. ఆ కుటుంబాన్ని రాజేశ్వరి, అనంత బాబు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారుlమాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల నుంచి వలసలను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రాంతంలో సరైన పనులు లేక గిరిజన కుటుంబాలు వలసలు పోయి, ఇతర ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.పలువురు వైఎస్సార్సీపీ నాయకులు వారి వెంట ఉన్నారు. -
విచారణ గాలికి..
– అంగడిలో ప్రశ్నపత్రాలు – రోడ్లపై విద్యార్థుల చక్కర్లు – అడ్డదారి తొక్కుతున్న యాజమాన్యం – రిజిస్టర్లు పాటించని ప్రైవేట్ పాఠశాలలు హిందూపురం అర్బన్ : సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు విద్యావిధానాన్నే అపహస్యంగా చేసేలా నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో 6వ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా జరిగిన ఉమ్మడి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ముందుగానే జిరాక్స్ కేంద్రాల్లో ప్రత్యక్షమయ్యాయి. ‘ప్రశ్నపత్రాలు అమ్మబడును’ శీర్షికతో 28వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. తర్వాత 29న తిరిగి ఇంగ్లిష్ పేపర్ లీక్ అయింది. దీనికి స్పందించిన డీఈఓ డివిజన్ విద్యాధికారులచే అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. హెచ్చరికలకే పరిమితం ప్రశ్నపత్రాలు పరీక్షల కంటే ముందుగా బహిర్గతమైనా అధికారులు తాపీగా పరీక్షలు కొనసాగించారు. బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు ఏ పాఠశాల నుంచి వచ్చాయని అంతు తేల్చాల్సిన అధికారులు హెచ్చరికలకే పరిమితమయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, మిగిలిపోయిన ప్రశ్నపత్రాల వివరాలు రిజిస్టరులో నమోదు చేయాల్సి ఉన్నా అధికారులు అవేవీ పట్టించుకోలేదు. విద్యార్థుల్లోని నిజమైన ప్రతిభను వెలికి Sతీసేందుకు కషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరీక్షలు నిర్వహించడంలో నిబంధనలన్నీ గాలికొదిలేసింది. చదువులు మానేసి రోడ్లపైకి.. సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరిగిన వారం రోజుల పాటు సాయంత్రం పూట విద్యార్థులు ఒక్కటే హడావుడి చేస్తున్నారు. ఫలానా చోట విద్యార్థికి ప్రశ్నపత్రం అందిందని తెలిసిన వెంటనే పరుగులు పెడుతున్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ చేసుకుని అందరూ పంచుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మార్కుల కోసం నల్లబోర్డులపై రాతలు రాసి.. పుస్తకాల్లో గుర్తులు పెట్టి మరీ పరీక్షలు రాయించారు. -
బీసీ సబ్‌ప్లాన్ అమలుపై మాటమార్చిన ఏపీ సర్కార్
హైదరాబాద్: బీసీ సబ్‌ప్లాన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట మార్చింది. రూ.6,640 కోట్లతో ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని నిన్నటివరకూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త పల్లవి ఎత్తుకుంది. బీసీ సబ్‌ప్లాన్‌ను వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రకటించారు. కాగా ఏపీలో బార్ లైసెన్స్‌లు నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. బందర్ పోర్టు రైతులకు ప్యాకేజీ అర్థం కాగా ఆందోళన చెందారని, పోర్టుకు 5,300 ఎకరాలు అవసరమని, అనుబంధ పరిశ్రమల కోసం 14వేల ఎకరాలకు సేకరిస్తామన్నారు. మొదట భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పుడు భూ సమీకరణ చేయాలనుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాగా రైతులకు ఇచ్చే ప్యాకేజీ ఇంకా ఖరారు కాలేదన్నారు. పెద్ద రైతులు రెచ్చగొట్టడం వల్లే ఆందోళన చేస్తున్నారని, త్వరలో రైతుల అభిప్రాయం తీసుకుంటామన్నారు. ఇక హైదరాబాద్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు...దరఖాస్తు చేసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈ ఏడాది 1600 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అలాగే ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు.