అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం | government fail to voter entry canvas says sangati manohar | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం

Published Fri, Nov 4 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

government fail to voter entry canvas says sangati manohar

అనంతపురం న్యూటౌన్‌ : ఎమ్మెల్సీ ఓటరు నమోదులో అర్హులైన పట్టభద్రులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సంగటి మనోహర్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థి అవ్వారు మల్లికార్జున, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రవియాదవ్‌తో కలసి స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించేందుకు మహాజనరాజ్యం పార్టీ కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థి«గా ఉన్న మల్లికార్జునకు మద్దతునిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement