ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం
Published Thu, Sep 15 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
బనగానపల్లె రూరల్: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్‌ఆర్ ఆర్‌టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాజారెడ్డి విమర్శించారు. బుధవారం బనగానపల్లె ఆర్టీసీ డిపోలో కార్మికుల సమస్యలపై డీఎం శశిభూషణ్‌తో చర్చించారు. అనంతరం ఓ ప్రై వేట్ లాడ్జీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్‌ఆర్ హయాంలో ఆర్టీసీపై పన్నులు తగ్గించడంతో సంస్థకు సంవత్సరానికి రూ.500 కోట్ల ఆదాయం చేకూరిందన్నారు. అక్రమ రవాణాను అరికట్టలేకపోవడం, ఉద్యోగులను తగ్గించడమే ఆర్టీసీ నష్టాలకు కారణమన్నారు. కర్ణాటక రాష్ట్రాల్లో ఇస్తున్న రాయితీలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఏటా అప్పులు పెరుగుతున్నాయన్నారు. ఆర్టీసీలో డ్రై వర్ల ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని హైకోర్టు తీవ్రంగా మందలించినా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాకుండా కార్మికులను వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికులు, ప్రయాణికులకు సరైన సౌకర్యాలు లేవని, బస్టాండ్ ప్రాంగణంలో అపరిశుభ్రత నెలకొందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి, డిపో కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, అధ్యక్షుడు నజీర్‌బాషా, నాయకులు వెంకటపతి, వెంకటేశ్వర్లు, మద్దయ్య, నాయక్, నాయుడు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement