జీవించే హక్కును హరిస్తున్న ప్రభుత్వాలు
జీవించే హక్కును హరిస్తున్న ప్రభుత్వాలు
Published Sun, Nov 27 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
- పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ ఎస్.శేషన్న
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జీవించే హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ ఎస్.శేషన్న ఆరోపించారు. ఆదివారం స్థాణఙఖ సీఆర్ భవన్‌లో రాజ్యాంగాన్ని గౌరవిద్దాం..ప్రజాస్వామిక హక్కులను కాపాడుకుందాం అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సదస్సుకు పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ శేషయ్య, హైదరాబాద్‌కు చందిన సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు లతీఫ్ అహ్మద్‌ఖాన్, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు అమర్‌నాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సదర్భంగా శేషయ్య మాట్లాడుతూ...ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో రెండు రాష్ట్రాల పోలీసులు 30 మంది అమాయక గిరిజనులు, మహిళలను కాల్చి చంపారని, అయినా ఆత్మరక్షణ కోసమే ఎన్‌కౌంటర్ చేయాల్సి వస్తోందని చెప్పడం విరుద్ధమన్నారు. ఏఓబీ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారుల పేర్లను బయట పెట్టాలన్నారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కావడంతోపై వారిపై ఐపీసీ 302 ప్రకారం హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లతీఫ్ అహ్మద్‌ఖాన్ మాట్లాడుతూ..రాజాధాని పేరిట మూడు పంటలు పండే భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకోవడం దారుణమన్నారు. కమ్యూనిస్టు యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫీడెల్ క్యాస్ట్రో, ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు మైకేల్‌బాబుకు ఘన నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాస్, పౌరహక్కుల నేత శివనాగిరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement