రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి
Published Sun, Sep 11 2016 11:46 PM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM
హన్మకొండ చౌరస్తా : ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రాజకీయ శక్తిగా ఎదిగిన యాదవుల స్ఫూర్తితో తెలంగాణలో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావ్‌యాదవ్ కోరారు. హన్మకొండలోని యాదవ మహాసభ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తెలంగాణ ప్రాంతంలో యాదవులు వెనుకబాటు తనంలో మగ్గుతున్నారన్నారు. యాదవ మహాసభ కార్యకర్తలు ఊరూరా తిరిగి సామాజికవర్గం ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్యయాదవ్, అర్బన్ అధ్యక్షుడు నోముల నరేందర్, మస్రగాని వినయ్‌కుమార్, ముంత రాజయ్య, వై.సాంబయ్య, దొనికెల రమాదేవి, ఎం.సాంబలక్ష్మి, బట్టమేకల భరత్, నక్క కొమురెల్లి, జిల్లెల కృష్ణమూర్తి, బంక సంపత్, డి శ్రీనివాస్, జినుక సిద్ధిరాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement