గౌరీశంకరుల వార్షికోత్సవం ప్రారంభం | gowrisankara natakalalu in darmavaram | Sakshi
Sakshi News home page

గౌరీశంకరుల వార్షికోత్సవం ప్రారంభం

Published Sun, Jan 15 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

gowrisankara natakalalu in darmavaram

ధర్మవరం (ప్రత్తిపాడు) : 
గ్రామంలో శ్రీ గౌరీశంకరుల 80వ వార్షిక మహోత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. జువ్వలవారి వీధిలో నాటక మహోత్సవాలను సొసైటీ అధ్యక్షుడు జువ్వల చినబాబు ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాౖటెన సభలో కళాకారులు దొడ్డిపట్ల సోమన్నదొర, సానా నూకరాజు నాయుడు, ౖవైఎస్సార్‌సీపీ నాయకుడు పుణ్యమంతు ల కామరాజు, కోనేటి రాజబాబు, సొసైటీ డైరెక్టర్‌ జువ్వల దొరబాబు, మాజీ వైస్‌ ఎంపీపీ బొల్లు కొండబాబు తదితరులు మా ట్లాడుతూ 80 ఏళ్లుగా గ్రామంలో నాటక ప్రదర్శనలు చేస్తున్న ఉత్సవ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో కోలా తాతబాబు, మచ్చెర్ల దాసు,  సిద్దా అప్పలరాజు పాల్గొన్నారు. 
ఆకట్టుకున్న నాటికలు 
తొలిరోజు రాత్రి నంది నాటకోత్సవాలలో ప్రదర్శనకు ఎంపికైన ‘కృషి’ నాటికను ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించారు. చదువు పరామార్ధాన్ని ఈ నాటిక చాటిచెప్పింది.  ఈ నాటికలో అమరాధి శ్రీరమ్య, సఖిలేటి స్వామి,  ఐతి సువర్ణ కీర్తి,  మేకల కోటేశ్వర అభిరామ్, పెదిరెడ్డి రాజా, నల్లా నూకరాజు నటన  ఆకట్టుకుంది. స్నేహా ఆర్ట్స్, చంద్రమాంపల్లి వారిచే ‘నమో నమః,’ పురోహితిక నాటక కళా పరిషత్‌ వారిచే ‘మాతృత్వం’ సాంఘిక నాటికలను ప్రదర్శించారు. 
రంజింపజేసిన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’ 
శనివారం రాత్రి ప్రదర్శించిన శ్రీరామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది.  వీఎస్‌ఎ¯ŒS రాజు (మీసాల రాజు), ఆవాల గన్నిబాబు, శవనగాని శ్రీనివాస్, సాగి రవివర్మ, దాట్ల రంగరాజు, కొండపల్లి సింగన్న, గ్రామస్తుల సహకారంతో గౌరీ శంకర ఉత్సవ కమిటి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. శ్రీరాముడుగా శ్రీనివాస్, 1వ ఆంజనేయ పాత్రలో నాగూర్‌బాబు (ధర్మవరం), 2వ ఆంజనేయునిగా బెండపూడి రామారావు పోటీ పడి నటించారు. మిగిలిన వారు పాత్రోచితంగా నటించారు.  ఈనాటకానికి హార్మోనియంతో కలిగట్ల రమణ సహకారం అందించారు.  గ్రామానికి చెందిన కళాకారుడు దొడ్డిపట్ల జగ్గారావు ‘దుర్యోధన’ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించారు. 
 
 

Advertisement
Advertisement