‘ఊర’oతా కలిసి.. అమ్మను కొలిచి..
‘ఊర’oతా కలిసి.. అమ్మను కొలిచి..
Published Sun, Jul 24 2016 10:59 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్‌కల్చరల్ : ఇందూరు ‘ఊర’ంతా పండుగ చేసుకుంది. అమ్మవారి సేవలో తరిం చింది. ఇందూరు సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏటా ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వా త వచ్చే ఆదివారం ఊర పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదివారం నగరంలో ఊర పండుగ నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని ఖిల్లా నుంచి ఉదయం 8.55 గంటలకు గ్రామదేవతల విగ్రహాలతో శోభాయాత్ర ప్రారంభమైంది. ‘సరి’ స్వీకరించడాని కి, అమ్మవారి తొట్ల కిందినుంచి వెళ్లడానికి భక్తు లు పోటీపడ్డారు. గాజుల్‌పేట, కస్బాగల్లి వద్ద సరి కోసం భక్తుల మధ్య తోపులాట జరిగింది. వినాయక్‌నగర్‌లో మత్తడిపోచమ్మ, ఐదుచేతుల పోచమ్మ, మహాలక్ష్మమ్మ, దుబ్బ ప్రాంతంలో పౌడాలమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ విగ్రహా లను, సిర్నాపల్లి గడి సమీపంలో కస్బాగల్లి వద్ద కొండల్‌రాయుడు, బోగంసాని, సార్గమ్మ, రాట్నం, పాతగంజ్‌లో అంపుడు పోచమ్మ విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. అంటువ్యాధులనుంచి కాపాడాలని, ఆయురారోగ్యాలతో పాడిపంటల తో విలసిల్లేలా చూడాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. పూజాదుల్లో నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, అర్బన్ ఎమ్మెల్యే బిగా ల గణేశ్ గుప్తా, ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీటీడీ బోర్డు మెంబర్ అరికెల నర్సారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు..
నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రంలో ఆదివా రం నిర్వహించిన ఊరపండగకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఊరపండుగ సాగే మార్గంలో అడుగడుగునా పోలీసులను నియమించారు. బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ డీఎస్పీ ఆనంద్‌కుమార్, ఆర్మూర్ డీఎస్పీ ఆకుల రాంరెడ్డి పర్యవేక్షించారు.
Advertisement