గ్రౌండ్ దాటాల్సిందే
సదాశివనగర్ :
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వారం రోజులుగా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేతులు, అన్నం తిన్న ప్లేట్లను కడగాలంటే పాఠశాల దాటి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణలో ఉన్న కుళాయిలకు నీటిని సరఫరా చేసే బోరుమోటారు చెడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటిని అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.