sadasivanagar
-
తరుగు..బస్తాకు 3 కిలోలు
పై చిత్రం పద్మాజీవాడి రేషన్ షాపులోనిది.. ఎల్ఎంఎస్ పాయింట్ నుంచి దుకాణానికి సరఫరా అయిన బియ్యం తూకం వేయగా.. 50 కిలోల బస్తాలో మూడు కిలోల తరుగు వచ్చింది. ప్రతి నెల ఇలాగే బియ్యం తక్కువ వస్తున్నాయని డీలర్ కిషన్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాం అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. సదాశివనగర్: ఆహార భద్రతాకార్డులు కలిగిన వారికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం సరఫరాలో గోల్మాల్ జరుగుతోంది. గోదాముల నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం సంచుల్లో.. బస్తాకు మూడు నాలుగు కిలోల తరుగు వస్తోంది. దీంతో రేషన్ డీలర్లు నష్టపోతున్నారు. నిబంధనల మేరకు ఒక్కో బస్తాలో 50 కిలోల బియ్యం ఉండాలి. హమాలీలు బస్తాలను లారీలలో ఎత్తేముందు ఒక్కో బస్తాను గోదాంలో తూకం వేస్తారు. తూకం తక్కువ ఉంటే బస్తాలో తిరిగి ఆ మేరకు బియ్యాన్ని కలిపి బస్తాలు కుట్టి పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం అమలవుతున్నట్లు కనిపించడం లేదు. ఒక్కో బస్తాలో ఒక్కో తీరుగా బియ్యం తూకం వస్తున్నాయని డీలర్లు పేర్కొంటున్నారు. బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు ఉంటోందంటున్నారు. యంత్రంతో లెక్కపక్కా.. ఒక్కో చౌకధరల దుకాణంలో లబ్ధిదారుల వివరాలను ముందుగానే యంత్రానికి అనుసంధానం చేయడంతో వారు చౌకధరల దుకాణంలో బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు నమోదు చేయగానే వారికి అందాల్సిన బియ్యం వివరాలను మిషన్ తెలియజేస్తుంది. బియ్యం తూకం వేసే సమయంలో ఏ మాత్రం తక్కువగా ఉన్నా వివరాలను చూపించదు. ఈ రకంగా తూకం వేస్తే ఒక్కో బస్తాకు మూడు కిలోలపైనే తక్కువగా వస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. నష్టపోతున్నాం.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ షాప్‌లకు సరఫరా చేస్తున్న బియ్యం బస్తాల్లో తరుగు వస్తోంది. బస్తాకు మూడు నుంచి ఐదు కిలోలు తక్కువ వస్తున్నాయి. దీంతో నష్టపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. – కిషన్‌రావు, రేషన్ డీలర్, పద్మాజీవాడి తరుగు లేకుండా చూస్తాం గోదాం నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యంలో తరుగు వస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సరైన తూకంతో బియ్యం సరఫరా చేయాలని సూచించాం. గోదాంలో తూకం వేసిన తర్వాతే డీలర్లకు అందేలా చర్యలు తీసుకుంటాం. – అమీన్‌సింగ్, తహసీల్దార్, సదాశివనగర్ -
గ్రౌండ్ దాటాల్సిందే
సదాశివనగర్ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో వారం రోజులుగా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత చేతులు, అన్నం తిన్న ప్లేట్లను కడగాలంటే పాఠశాల దాటి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణలో ఉన్న కుళాయిలకు నీటిని సరఫరా చేసే బోరుమోటారు చెడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తాగునీటిని అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. -
కన్నీటి వరద
మూడు రోజులకు వెలుగు చూసిన ఘటన తుంగవాగులో తేలిన మృతదేహాలు జిల్లాలో ‘కన్నీటి’ వరద పోటెత్తింది. భారీ వర్షాలతో వచ్చిన బీభత్సం సృష్టించింది. నిండు ప్రాణాలను బలిగొంది. రైతన్నలకు అంతులేని నష్టాలను మిగిల్చింది. సదాశివనగర్ తుంగవాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మూడ్రోజులకు మృతదేహాలు బయటపడడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మరోవైపు, పడగల్ నవాబ్ చెరువు అలుగు వరదలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. పంట పొలాలను చెరువులుగా మార్చిన వరద.. అన్నదాతలను నిలువునా ముంచింది. వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. సదాశివనగర్: పోటెత్తిన తుంగవాగు ఇద్దరు యువకులను బలిగొంది. మూడ్రోజుల క్రితం వరద ఉద్ధృతికి గల్లంతైన యువకులు మృతి చెందారు. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సదాశివనగర్‌కు చెందిన రైతు పోలబోయిన లచ్చయ్య, కళావతి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్నవాడైన రంజీత్‌కుమార్ (23) ఆర్నెల్ల క్రితమే విదేశాల నుంచి తిరిగివచ్చి, ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కోతి భూంరెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (21) కామారెడ్డిలోని ఓ హోటల్లో సూపర్వైజర్. స్నేహితులైన రంజీత్, విష్ణు శనివారం సాయంత్రం బైక్‌పై గిద్ద గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. రామారెడ్డి ప్రధాన రహదారిపైకి అప్పటికే వరద చేరగా, ఆ నీటిలోంచే వారు వెళ్లారు. అదే రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అప్పటికే భారీ వర్షం కురియడంతో వాగులో వరద ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఇది గమనించని రంజీత్, విష్ణు వాగు దాటేందుకు యత్నించారు. వరద ఎక్కువగా ఉండడంతో బైక్‌తో సహా కొట్టుకుపోయారు. అయితే, ఎంతకీ వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. అంతకు ముందే బయల్దేరుతున్నామని చెప్పిన పిల్లల ఫోన్లు అంతలోనే స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులను వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. అయితే, సోమవారం ఉదయం కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై నాగరాజు, సిబ్బంది వచ్చి చూడగా, రంజీత్‌కుమార్ మృతదేహం కనిపించింది. సమీపంలోనే విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం, బైక్‌ను గుర్తించారు. విగతజీవులుగా మారిన యువకులను చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. -
కారు - ఆటో ఢీ 9 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గొల్లపల్లి శివారులో ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలు అయ్యాయి. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.గాయపడిన వారిని చికిత్స కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
మైనర్‌కు పెళ్లి
సదాశివనగర్, న్యూస్‌లైన్: సదాశివనగర్ మండల కేంద్రంలో శుక్రవారం బాల్య వివాహం జరిగింది. మండల కేంద్రానికి చెందిన మర్కంటి రణిత(16)ను దోమకొండ మండలం మల్కాపూర్‌కు చెందిన రాజుకు ఇచ్చి శుక్రవారం పెళ్లి చేశారు. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న ఇరు కు టుంబాల వారు అధికారులు వచ్చేలోపు వివాహం జరిపించారు. దీంతో అధికారు లు బాల్య వివాహాన్ని అడ్డుకోలేక పోయారు. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాతనే రణితను అత్తారింటికి పంపించాలని ఆమె తల్లిదండ్రుల చేత అధికారులు రాతపూర్వకంగా రాయించుకున్నారు. అంతేకాకుండా రణిత తల్లిదండ్రులు బీరయ్య, తల్లి మల్లవ్వ, రాజు తల్లిదండ్రులు నర్సింహులు, మల్లవ్వకు కౌన్సెలింగ్ నిర్వహిం చా రు. వివాహ వయస్సు రాకముందు పెళ్లిలు చేస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు, బా ల్య వివాహాలు చేస్తే చట్ట ప్రకారం తీసుకునే చర్యల గురించి వివరించారు. కార్యక్రంలో ఐసీడీఎస్ సీడీపీవో శశికళ, తహశీల్దార్ శరత్‌కుమార్, ఎస్సై నవీన్‌కుమార్, ఆర్ఐ కిష్టయ్య, వీఆర్వో శంకర్రాజు, అంగన్వాడీ కార్యకర్త గంగమణి పాల్గొన్నారు.