చిత్రకారుడు గువ్వల కెనడీ అస్తమయం
చిత్రకారుడు గువ్వల కెనడీ అస్తమయం
Published Fri, Dec 9 2016 11:41 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రముఖ చిత్రకారుడు గువ్వలకెనడీ(53) శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటుతో స్ధానిక కంబాలపేటలోని ఆయన నివాసంలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారాన్ని తీసుకుని, గణపతి చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతుండగా, హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన కన్ను మూసారు. కంబాలపేటలో ఆయన క్రియేటివ్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి యువతకు చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చేవారు. శిధిలమవుతున్న దామెర్ల రామారావు చిత్రాలను ఆయన తిరిగి రూపొందించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఆయన చిత్రాలు బహుమతులను గెలుచుకున్నాయి. ఆయన భార్య గువ్వల పద్మ కూడా చిత్రలేఖనంలో నిపుణురాలు. 2017 జనవరిలో నగరంలో చిత్రలేఖన ప్రదర్శన నిర్వహించడానికి ఆయన ప్రణాళికలు తయారుచేసుకుంటున్నారు. సమైక్య ఉద్యమం, హేవ్‌లాక్ వంతెన పరిరక్షణ తదితర ప్రజాసమస్యలను ఆయన పెయింటింగుల ద్వారా వివరించేవారు. ఆయన మృతికి నగరప్రముఖులు, కళాకారులు సంతాపాన్ని వ్యక్తంచేశారు. గువ్వల కెనడీ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. కాగా శనివారం ఉదయం పది గంటలకు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో కెనడీ అభిమానుల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించనున్నారు.
Advertisement
Advertisement