విద్యార్థులూ... ఎదగాలి మీరు | hand wash day | Sakshi
Sakshi News home page

విద్యార్థులూ... ఎదగాలి మీరు

Published Sat, Oct 15 2016 11:30 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

విద్యార్థులూ... ఎదగాలి మీరు - Sakshi

విద్యార్థులూ... ఎదగాలి మీరు

ఆత్కూరు (ఉంగుటూరు) : విధ్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం ఉంగుటూరు మండలం ఆత్కూరు జిల్లా పరిషత్‌ హైస్కూలులో చేతుల పరిశుభ్రతా దినోత్సవాన్ని నిర్వహించారు. సీఎం మాట్లాడతూ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు చెప్పారు. ప్రజల్లో మంచి ఆహార అలవాట్ల కోసం విద్య, వైద్యశాఖలు సంయుక్తంగా పనిచేయాలన్నారు. విద్యార్థి దశనుండే మంచి అలవాట్లు అనుసరిస్తే ఆ ప్రభావం వ్యవస్థపై పడుతుందని దీనివలన మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించటంలో ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జెడ్పీ చైర్‌ప్సన్‌ గద్దె అనురాధ,ఎంపీ కె.నారాయణ, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, బోడే ప్రసాద్‌ పాల్గొన్నారు. 
లీలారత్నకుమారి విగ్రహావిష్కరణ 
సీఎం ప్రత్యేక కార్యదర్శి అడుసుమిల్లి రాజమౌళి కుటుంబాన్ని ఆత్కూరు గ్రామంలో శనివారం చంద్రబాబు పరామర్శించారు. ఇంటి ఆవరణలో తల్లి లీలారత్నకుమారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement