ఖతర్‌లో హరితహారం
జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఖతర్‌లో తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారిని డాక్టర్ ఎల్లాల శ్రీనివా స్‌రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ సమితి అధ్యక్షుడు రవిగౌడ్, సుందరగిరిగౌడ్, మహిపాల్, తిరుపతి, గోపాల్, శ్రీధర్‌గౌడ్, ఎండి.ఖాజా, మహేందర్, గంగసాయి, తిరుపతి, చారి, నర్సింహులు, నర్సయ్య, శ్రావణ్ పాల్గొన్నారు.