వైద్య రంగానికి పెద్దపీట
వైద్య రంగానికి పెద్దపీట
Published Sun, Jul 24 2016 6:53 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
నెల్లూరు(అర్బన్) : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ వైద్యరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. కిమ్స్(బొల్లినేని) ఆస్పత్రి సౌజన్యంతో దర్గామిట్టలోని అచ్యుత సుబ్రహ్మణ్యం కల్యాణమండపంలో ఆదివారం తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ (టీఎన్‌సీపీఏ) 7వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ ఆర్‌ఎంపీలుగా ప్రథమచికిత్స చేస్తున్నవారిపై వేధింపులు లేకుండా చూస్తామన్నారు. వారు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు శిక్షణ ఇవ్వబోతున్నామన్నారు. అనంతరం మంత్రిని సన్మానించారు. ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, కిమ్స్ ఈడీ గిరినాయుడు, మేయర్ అబ్దుల్ అజీజ్, చాట్ల నరసింహారావు, డా.జెyŠ. శివప్రసాద్ మాట్లాడారు. డాక్టర్‌లు శ్రీనివాసరాజు, చక్రవర్తి, కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా.రంగారావు, టీఎన్‌సీపీఎ జిల్లా అధ్యక్షుడు గొలుసు రత్నం పాల్గొన్నారు.
ఉచితంగా చదివిస్తా..
ఇటీవల మతిచెందిన సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరుకి చెందిన టీఎన్‌సీపీఏ సభ్యుడు మునిరాజా కుమార్తెలను తన ఈ టెక్నో పాఠశాలలో ఉచితంగా చదివిస్తానని మంత్రి నారాయణ తెలిపారు. సమావేశంలో మునిరాజా కుటుంబసభ్యులకు ఆర్థికసాయం చేశారు.
Advertisement
Advertisement