బాబు తోక ఆడిస్తే జైలే: నారాయణ | Narayana comments on chandrababu | Sakshi
Sakshi News home page

బాబు తోక ఆడిస్తే జైలే: నారాయణ

Published Mon, Jan 8 2018 2:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:34 PM

Narayana comments on chandrababu - Sakshi

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి చంద్రబాబు తోక ఆడిస్తే ప్రధాని నరేంద్రమోదీ వెంటనే జైల్లో పెట్టిస్తారని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసును గుప్పెట్లో పెట్టుకుని మోదీ చంద్రబాబును ఓ ఆట ఆడిస్తున్నారన్నారు. అందువల్లే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించుకోలేకున్నారని ఆదివారం విజయవాడలో మీడియాతో చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుది ప్రస్తుతం బానిస బతుకైందని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణంపై సీపీఐ బృందం నేరుగా ప్రధానిని కలిసిందని, ఆ పని టీడీపీ చేయలేకపోయిందన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలపై సోమవారం నుంచి జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో చర్చించి ముసాయిదాను ఖరారు చేస్తామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement