ఐటి దాడులతో వేడెక్కిన తిరుపతి రాజకీయం | heat on Tirupati politics with IT attacks | Sakshi
Sakshi News home page

ఐటి దాడులతో వేడెక్కిన తిరుపతి రాజకీయం

Published Fri, Dec 30 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

heat on Tirupati politics with IT attacks

తిరుపతి తుడా :  ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు డాక్టర్‌ గుణశేఖర్‌ యాదవ్‌ తన భార్యకు తిరుపతి మేయర్‌ టికెట్‌ ఖరారు చేసుకున్నారనే నేపథ్యంలో ఐటీదాడులు షాకిచ్చాయి. అంతర్గత విభేదాలతోనే ఈ దాడులు జరిగా యా అని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి వున్న తమను కాదని కొత్త వ్యక్తికి ఎలా ఇస్తారని కొందరు, మంత్రి నారాయణ జోక్యంపై మరికొందరు అధిష్టానానికి గతంలోనే ఫిర్యాదు చేశారు. గుణశేఖర్‌ యాదవ్‌ను మేయర్‌ రేసు నుంచి తప్పించాలంటే ఐటీ దాడులే సరైన మార్గమని ఓ ఎమ్మెల్యే సమీప బంధువు, ఓ మహిళా నేత పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. యాదవ వర్గానికే మేయర్‌ టికెట్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన గుణశేఖర్‌ మంత్రి నారాయణ ద్వారా పావులు కదిపారు.

తిరుపతిలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆర్థిక వనరులెక్కువగా వుండడంతో మంత్రి ఆయనపైనే మొగ్గు చూపుతూ వచ్చారు. టికెట్‌ పోటీలో ముందు వరుసలో వున్న గుణశేఖర్‌ యాదవ్‌పై ఐటీ గురిపెట్టి భారీ మొత్తంలో ఆస్తులున్నట్లు గుర్తించడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో ఆశావాహ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. సామాజిక వర్గం పరంగా నర్సింహయాదవ్‌ ముందు వరుసలో వుండగా ఎమ్మెల్యే వర్గం ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని తెరపైకి తెచ్చేం దుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. డాక్టర్‌ సుధారాణి పార్టీతో సన్నిహితంగా వుంటూ మేయర్‌ టికెట్‌ లేదా తుడా చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement