- 3,961 కేసులు రాజీ మార్గంలో పరిష్కారం
అనంతపురం లీగల్ : జిల్లాలో జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. 3,961 కేసులు రాజీమార్గంలో శాస్వత పరిష్కారం పొందాయి. శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లకు కక్షిదారులు ఉత్సాహంగా తరలివచ్చారు. కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులతో పాటుగా ఇంకా కోర్టు గడప చేరని ప్రీలిటిగేషన్ కేసులు దాదాపు 1,544 పరిష్కారమయ్యాయి.
జాతీయ లోక్‌అదాలత్‌కు విచ్చేసిన కక్షిదారులందరికీ భోజన వసతి,తాగునీటి సౌకర్యం కల్పించారు. సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.కమలాకర్ రెడ్డి న్యాయసేవాసదన్‌లో లోక్‌అదాలత్ నిర్వహించారు. వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, బకాయిలు, చెక్‌బౌన్సు కేసులు, రాజీకాదగిన క్రిమినల్ కేసులు, ఇంకా కోర్టులో దాఖలు చేయని వివాదాలను కూడా ఈ లోక్ అదాలత్‌లో రాజీ మార్గంలో పరిష్కరించారు.
కిటకిటలాడిన లోక్ అదాలత్
Published Sat, Jul 8 2017 11:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement