Lokadalath
-
కిటకిటలాడిన లోక్ అదాలత్
- 3,961 కేసులు రాజీ మార్గంలో పరిష్కారం అనంతపురం లీగల్ : జిల్లాలో జిల్లా న్యాయసేవాప్రాధికార సంస్థ నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. 3,961 కేసులు రాజీమార్గంలో శాస్వత పరిష్కారం పొందాయి. శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిల్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లకు కక్షిదారులు ఉత్సాహంగా తరలివచ్చారు. కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసులతో పాటుగా ఇంకా కోర్టు గడప చేరని ప్రీలిటిగేషన్ కేసులు దాదాపు 1,544 పరిష్కారమయ్యాయి. జాతీయ లోక్‌అదాలత్‌కు విచ్చేసిన కక్షిదారులందరికీ భోజన వసతి,తాగునీటి సౌకర్యం కల్పించారు. సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కార్యదర్శి ఎస్.కమలాకర్ రెడ్డి న్యాయసేవాసదన్‌లో లోక్‌అదాలత్ నిర్వహించారు. వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు, బకాయిలు, చెక్‌బౌన్సు కేసులు, రాజీకాదగిన క్రిమినల్ కేసులు, ఇంకా కోర్టులో దాఖలు చేయని వివాదాలను కూడా ఈ లోక్ అదాలత్‌లో రాజీ మార్గంలో పరిష్కరించారు. -
12న జాతీయ లోక్ అదాలత్
ఏలూరు(సెంట్రల్): జిల్లాలోని కోర్టులున్న అన్ని చోట్ల జాతీయలోక్ అదాలత్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.తుకారాంజీ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్, బ్యాంకు బుణాలు, టెలిఫోన్ బకాయిలు వాహన సంబంధ కేసులు చట్ట ప్రకారం రాజీ చేసుకొదగిన అన్ని రకాల కేసులను పరిష్కరించడం జరుగుతుందని, కేసుల రాజీ పరిష్కరానికి గాను కక్షిదారులు తగిన సూచనలు, సహకారం నిమిత్తం సంబంధిత కోర్టులు, పోలీసు, ఎక్సైజ్ శాఖల సిబ్బందిని సంప్రదించి, కేసులను సత్వర పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్‌ను వినియోగించాలని తుకారాంజీ కోరారు. -
లోక్ అదాలత్‌లో 729 కేసుల పరిష్కారం
ఏలూరు (సెంట్రల్) : జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 729 కేసులు పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రెండో అదనపు జిల్లా జడ్జి కె.సాయి రమాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు సివిల్‌కోర్టుతో సమానంగా పరిగణించబడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారిత సంస్థ కార్యదర్శి ఎ.నరసింహమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
మచిలీపట్నం : జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నామని రాజీకి అవకాశం కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆరవ అదనపు జిల్లా జడ్జి మల్లికార్జునరావు సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పెడన మండలం నడుపూరులో న్యాయవిజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయాన్ని అర్హులైన వారంతా వినియోగించుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, విత్తనాలు సరిగ్గా మొలకెత్తకుంటే సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, న్యాయవాది చీలి ముసలయ్య, సర్పంచ్ కుమారస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రాజీ ద్వారా కేసులు పరిష్కారం
122 కేసులకు పరిష్కారం కమాన్‌చౌరస్తా: కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌లు ఉపయోగపడుతున్నాయని జిల్లా ఇన్చార్జి జడ్జి బి.సురేశ్ తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లా కోర్టులోని న్యాయసేవాసదన్‌లో శనివారం లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం ద్వారా వారిలో అవగాహన కల్పించి కేసులు పరిష్కరిస్తున్నామన్నారు. దీంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే అవసరముండదని, ఇరువర్గాల మధ్య ద్వేషాలు తగ్గిపోతాయని అన్నారు. ఐదో అదనపు జిల్లా జడ్జి నాగరాజు, న్యాయసేవాసంస్థ కార్యదర్శి భవానీచంద్ర మాట్లాడుతూ రాజీచేయదగిన క్రిమినల్, సివిల్ కేసులతోపాటు కోర్టుకురాని ఫ్రీలిటిగేషన్ కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌ల ద్వారా 122 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. వీటిలో 14 సివిల్ కేసులు, 102 క్రిమినల్, 6 ఫ్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెజిస్ట్రేట్లు మా«ధవి, శ్రీనివాస్, కక్షిదారులు పాల్గొన్నారు. -
13న మెగా లోక్ అదాలత్
విశాఖ లీగల్: ప్రజా న్యాయపీఠం సేవలు శాశ్వతమైనవని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.జయసూర్య అన్నారు. విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో నగరంలోని వివిధ బ్యాంకుల అధికార ప్రతినిధులతో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. వచ్చేనెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా భారత జాతీయ బ్యాంకుల చట్టం 138ని ఉటంకించారు. చట్టపరిధిలో రాజీ కాగలిగిన బ్యాంకు కేసులను తక్షణమే గుర్తించి రాజీ ప్రయత్నాలు చేయాలన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, కంపెనీలు యాజమాన్యాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. లోక్‌అదాలత్ కార్యదర్శి ఆర్.వి.నాగసుందర్ మాట్లాడుతూ వచ్చే నెల 13న బ్యాంకులు, చెల్లని చెక్కులు, రాజీ కాగలిగిన సివిల్, క్రిమినల్ తగాదాలు, కుటుంబ న్యాయస్థానం పరిధిలోని కేసులు పరిష్కరిస్తామన్నారు. కేసులు పరిష్కరించుకోవాలనుకున్నవారు తక్షణమే తమ న్యాయస్థానం, న్యాయవాది లేదా తగిన వివరాలతో లోక్ అదాలత్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, లోక్ అదాలత్ సీనియర్ సభ్యులు ప్రసన్నకుమార్, ఆర్.శ్రీనివాసరావు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
రాజీ కేసులు లోక్ అదాలత్‌కు మంచిది
హైదరాబాద్: రాజీపడ్డ కేసులన్నీ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి కల్యాణ్‌సేన్ గుప్తా అన్నారు. మనది లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న గొప్ప ప్రజాస్వామ్య దేశమని ఈ సందర్భంగా కొనియాడారు. పది లక్షల మంది జనాభా ఉన్నప్పుడు 50 మంది జడ్జీలు ఉంటేనే కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు. -
నేడు అన్ని కోర్టుల్లో మెగా లోక్‌అదాలత్
రాష్ట్ర వ్యాప్తంగా 44 వేల కేసుల పరిష్కారం లక్ష్యం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 44 వేల కేసులను లోక్‌అదాలత్‌లో ఇరువర్గాలను ఒప్పించడం ద్వారా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థ సభ్య కార్యదర్శి జి.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఇందులో సివిల్ కేసులు 6,670, క్రిమినల్ కేసులు 15,959, ప్రీలిటిగేషన్ (సివిల్, క్రిమినల్) కేసులు 22,413 ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్న సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఒకేసారి జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నిర్వహించడం లేదని తెలిపారు. మన రాష్ట్రంలో ఎన్నికలు లేని నేపథ్యంలో మెగా లోక్‌అదాలత్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం అనుమతించారని చెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, జస్టిస్ రోహిణిల పర్యవేక్షణలో లోక్‌అదాలత్ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రాజీ ద్వారా పరిష్కరించేందుకు అవకాశం ఉన్న 33 వేల కేసుల్లో ఇరువర్గాలకు ఇప్పటికే నోటీసులు జారీచేశామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థల చైర్మన్ సహకారంతో అన్ని కోర్టుల్లో లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నామని.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ లోక్‌అదాలత్‌లో రంగారెడ్డి జిల్లా పరిధిలో నాలుగు వేల కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కందుకూరి అశోక్‌బాబు తెలిపారు. అలాగే జంట నగరాల పరిధిలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 2,500 కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని నాంపల్లి క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రజిని చెప్పారు.