లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
Published Fri, Oct 7 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
మచిలీపట్నం : జిల్లాలోని అన్ని కోర్టులలో శనివారం లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నామని రాజీకి అవకాశం కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆరవ అదనపు జిల్లా జడ్జి మల్లికార్జునరావు సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పెడన మండలం నడుపూరులో న్యాయవిజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయాన్ని అర్హులైన వారంతా వినియోగించుకోవాలని కోరారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, విత్తనాలు సరిగ్గా మొలకెత్తకుంటే సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, న్యాయవాది చీలి ముసలయ్య, సర్పంచ్ కుమారస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement