లోక్ అదాలత్‌లో 729 కేసుల పరిష్కారం
Published Sat, Oct 8 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
ఏలూరు (సెంట్రల్) : జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 729 కేసులు పరిష్కరించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రెండో అదనపు జిల్లా జడ్జి కె.సాయి రమాదేవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు సివిల్‌కోర్టుతో సమానంగా పరిగణించబడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారిత సంస్థ కార్యదర్శి ఎ.నరసింహమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ వై.సాయిశ్రీకాంత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement