రాజీ ద్వారా కేసులు పరిష్కారం | lokadalath in Karimnagar court | Sakshi
Sakshi News home page

రాజీ ద్వారా కేసులు పరిష్కారం

Published Sat, Sep 10 2016 9:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

రాజీ ద్వారా కేసులు పరిష్కారం

రాజీ ద్వారా కేసులు పరిష్కారం

  • 122 కేసులకు పరిష్కారం
  •  కమాన్‌చౌరస్తా: కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌లు ఉపయోగపడుతున్నాయని జిల్లా ఇన్‌చార్జి జడ్జి బి.సురేశ్‌ తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా జిల్లా కోర్టులోని న్యాయసేవాసదన్‌లో శనివారం లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారం కోసం  మధ్యవర్తిత్వం ద్వారా వారిలో అవగాహన కల్పించి కేసులు పరిష్కరిస్తున్నామన్నారు. దీంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే అవసరముండదని, ఇరువర్గాల మధ్య ద్వేషాలు తగ్గిపోతాయని అన్నారు. ఐదో అదనపు జిల్లా జడ్జి నాగరాజు, న్యాయసేవాసంస్థ కార్యదర్శి భవానీచంద్ర మాట్లాడుతూ రాజీచేయదగిన క్రిమినల్, సివిల్‌ కేసులతోపాటు కోర్టుకురాని ఫ్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌ల ద్వారా 122 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. వీటిలో 14 సివిల్‌ కేసులు, 102 క్రిమినల్, 6 ఫ్రీలిటిగేషన్‌ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మెజిస్ట్రేట్‌లు మా«ధవి, శ్రీనివాస్, కక్షిదారులు పాల్గొన్నారు.
     
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement