ప్రతిఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి | helping nature in everyone | Sakshi
Sakshi News home page

ప్రతిఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలి

Published Mon, Aug 29 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

helping nature in everyone

నేరడగం పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి
మాగనూర్‌ : ప్రతి మనిషి తనకు ఉన్నదానిలో కొంత పేదలకు దానం చేయాలని, సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంపొందించాలని పశ్చిమాద్రి విరక్తమఠం పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి అన్నారు. శ్రావణ ఆఖరి సోమవారం సందర్భంగా కాంట్రాక్టర్‌ బెంగుళూర్‌ నాగిరెడ్డి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి మనిషి ఎంత సంపాదించిన చివరకు ఆయన వెంట ఏవీ రావని, మిగిలేది కీర్తి, ప్రతిష్టలేనని స్వామిజీ అన్నారు. అందుకు ప్రతిఒక్కరూ తనకు ఉన్నదానిలో కొంత దానం చేయడం వల్ల వారికి పుణ్యం లభిస్తుందని అన్నారు. అనంతరం స్వామిజీలతో పాటు ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్షీరలింగమహస్వామి, ఎంపీపీ ఆంజనమ్మ, జెడ్పీటీసీ సరిత మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆశిరెడ్డి, సర్పంచ్‌లు సూగమ్మ, లింగప్ప, ఆంజప్పగౌడ్, చెన్నప్పగౌడ్, మహదేవ్, ఎంపీటీసీ మునాఫ్, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ రాజప్పగౌడ్, నాయకులు కీరప్పగౌడ్, శివరాజ్‌పాటేల్, సిద్రాంరెడ్డి, వీరప్పగౌడ్, రాజు, రాంచందర్, శరణప్ప తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement