తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండివేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతున్నాయి. సోమవారం కొత్తగూడెం పట్టణంలో సోమవారం మధ్యాహ్నం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. మధ్యహ్నం సమయంలో పట్టణంలో 50డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం ఖమ్మం జిల్లాలోనే మణుగూరులో ఉష్ణోగ్రత 50డిగ్రీ ల మార్కును దాటింది.
ఈ ప్రాంతం అంతా సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కావటంతో సహజంగానే ఇక్కడ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఏటా మే నెలలో మాత్రమే ఇక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ఏప్రిల్‌లోనే ఇంత తీవ్రంగా వడగాల్పులు వీచడంతో జిల్లా వాసులు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు.