ముద్రగడను ఎలా డీల్ చేయాలో తెలుసు | Home Minister chinarajappa comments on mudragada | Sakshi
Sakshi News home page

ముద్రగడను ఎలా డీల్ చేయాలో తెలుసు

Published Sat, Jun 11 2016 1:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ముద్రగడను ఎలా డీల్ చేయాలో తెలుసు - Sakshi

ముద్రగడను ఎలా డీల్ చేయాలో తెలుసు

హోం మంత్రి చినరాజప్ప
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: ముద్రగడ పద్మనాభం సంగతి మాకు బాగా తెలుసు.. ఆయన్ను ఎలా డీల్ చేయాలో కూడా మాకు తెలుసునని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన శుక్రవారం మాట్లాడారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపులు ఇచ్చిన తూర్పుగోదావరి బంద్ విఫలమైందన్నారు. పోలీసులు బంద్‌ను విజయవంతం కానివ్వరని, రేపు బంద్‌నూ అలాగే విఫలం చేస్తామని తెలిపారు. టీవీ ప్రసారాలను ఎందుకు అపేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. శాంతిభద్రతల సమస్య రాకుండా కొన్ని చానళ్లను కావాలనే నియంత్రించామని చెప్పారు. ముద్రగడ దీక్ష విరమిస్తే సాక్షి ప్రసారాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.

 ముద్రగడ కోరితే తుని కేసు సీబీఐకి..
 సాక్షి, అమరావతి: ముద్రగడ పద్మనాభం కోరితే తుని కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హోమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో ఈ విషయాన్ని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement